పార్టీలకు పీకే మానియా…

ప్రపంచ క్రికెట్ కప్ కోసం భారత్ ఒకసారి అకస్మాత్తుగా దేబాశిష్ మహంతీ అనే క్రీడాకారుడిని ఎంపిక చేసింది. ఆయన గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడుతాడని క్రికెట్ బోర్డ్ అభిప్రాయం. అంచనా కూడా. కానీ, ఆ అంచనా తలకిందులయింది.

2024 సాధారణ ఎన్నికల కోసం దేశం పీకే మానియా లో కూరుకుపోయింది. రాజకీయ వ్యూహకర్త గా ప్రశాంత్ కిశోర్ ఇవ్వబోయే వ్యూహాత్మక కార్యాచరణ తో పాతాళం లో ఉన్న పార్టీలు కూడా భూమ్మీదికొస్తాయని ఆయా పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన ఒక పాతాళ గరిగె లెక్క అన్నట్టు. బొక్కెన తాకినా తాకకున్నా బయటకు ఇగ్గుకొస్తనని ఆయన తన ప్రతిపాదనలతో నమ్మిస్తున్నడు.

ప్రతిపక్షం లో ఉన్న కాంగ్రెస్ కు ఆయన ఒక మృత సంజీవనిలా ఉపయోగ పడొచ్చని ఆ పార్టీ ఉద్ధండులనుకుంటున్నరు. అయితే, ఆయన ఎందుకో దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ చేయడానికి కంకణం కట్టు కున్నడేమో అనిపిస్తాది.

పీకే మానియా దేశ ప్రజాస్వామిక మూలాల పై వేసిన ఎండ్రిన్ గోలీలా అనిపిస్తున్నది. వోట్ స్వామ్యం లో ప్రశాంత్ కిశోర్ లు గేమ్ ఛేంజర్ లు అవుతారాలేదా అనేది చెప్పలేం కానీ పీకే మానియా బీటీ విత్తనం లా ప్రజాస్వామిక మూలాలను కొల్లగొట్టి సారవంతమైన పునాదుల్ని మరింత కలుషితం చేస్తాదేమో అని అనిపిస్తున్నది. మీరేమంటారు?

P V Kondal Rao

You missed