టీఆరెస్ సోషల్ మీడియాను ఎవరు నడుపుతున్నారో తెలియదు కానీ… ఈ మధ్య యాక్టివయ్యింది. స్వచ్చంధంగానే చాలా మంది టీఆరెస్‌కు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్ అందరూ అంత యాక్టివ్ ఉన్నారా ..? లేదా…? అసలు వాళ్లను పట్టించుకునేవారున్నారా.?? అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా? ఇవన్నీ వదిలేస్తే..? బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా… ప్రతీ సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మీమ్స్, విమర్శలు గుప్పిస్తూ సందర్భానుసారం పంచ్‌లు పేలుస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కొందరు టీఆఎస్ అభిమానులు.
మొదట బీజేపీ సోషల్ మీడియా తాకిడిని టీఆరెస్ తట్టుకోలేకపోయింది. అందుకోలేక పోయింది. కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక చేతులెత్తేసి వెళ్లకిలా పడిపోయింది. ఈ మధ్య వీళ్లు హుషారయ్యారు. బీజేపీ పంథానే అనుసరిస్తున్నారు. ఏ చిన్న తప్పు దొరికినా.. ఏ చిన్న వీడియో క్లిప్పింగ్ కెమెరాకు చిక్కినా.. ఇక తమదైన..(బీజేపీ స్టైల్ కూడా) శైలిలో ఆడుకుంటున్నారు. మీరు చెప్పిన విద్యే మహాశయా అన్నట్టు.. బీజేపీ నేతలను ఆడేసుకుంటున్నారు. వైరల్ చేసేస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇదెంత వరకు వచ్చిదంటే.. సాక్షాత్తూ బండి సంజయే నేను లవంగం తింటాను… కానీ దాన్ని తంబాకు అని ప్రచారం చేస్తున్నారని సంజాయిషీ ఇచ్చుకునే లెవల్‌లో. మరి వీళ్లు మట్లాడింది గగతంలో.. ఇదే తరహా. డ్రగ్స్‌తో కేటీఆర్‌కు లింకు.. కేసీఆర్ లిక్కర్ ప్రియుడు…. కవిత కేఎస్టీ…. ఇలా ఎవరికి తోచించి వారు.. నోటికొచ్చింది వాగేశారు. కొత్త రాజకీయ భాషకు తెరతీశారు. ఇప్పుడు టీఆరెస్ ఆ స్థాయిలో కాకున్నా.. కొంచెం అదే పంథాలో వీరు నేర్పిన బాటలోనే సాగుతున్నారు. అర్వింద్ … టీఆరెస్ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటానన్నాడు. బ్లేడ్ బాబ్జీని చేసేశారు. ఎల్లమ్మతల్లికి చెప్పు ముడుపు అని ఏదో నోరు జారాడు. గౌడ్‌లకు క్షమాపణ చెప్పు… నిన్ను ఎల్లమ్మతల్లి బలితీసుకుంటుంది… నీవు హిందువు కాదు.. బొందువు.. అని అవకాశం దొరికిందే తడువు తకిటతకదిమి ఆడుకుంటున్నది.
ఇట్లుంటది మనతోని అని ఎవరికి వాళ్లే ఇలా సోషల్ మీడియాలో కడిగిపారేసుకుంటున్నారు.