ఆరెస్ ప్రవీణ్‌కుమార్. ఐపీఎస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరినప్పుడు కొంతమంది కొంచెం అంచనాలు పెట్టుకున్నారు. ఏదో చేస్తాడనుకున్నారు. ఇలాంటోళ్లు కూడా రాజకీయాల్లోకి రావాలి… అని కూడా కోరుకున్నారు. దిగితే గానీ లోతు తెలియదన్నట్టు.. మాట్లాడితే గానీ మెదడులో గుజ్జెంతో బయటపడదన్నట్టు.. ఆయన మాటలు, చేతలు, ఆరోపణలు…. ఫక్తు ఓ సాదాసీదా గల్లీ లెవల్ రాజకీయ నాయకుడనిపించుకున్నాడు. ఆరోపణల్లో పసలేదు. ఆలోచనలేదు. మేదోమథనం ఉండదు. నోటికేదొస్తే అది అనడం.. తాము అధికారంలోకి వస్తే…. ఇది చేస్తాం.. అది చేస్తాం…. అంటూ హామీలు గుప్పించడం… అధికారంలోకి వస్తే…. అనేది ఎంతటి కష్టతరమో ఆయనకూ తెలుసు.
మరలాంటప్పుడు ఈ హామీలు గుప్పించడం పక్కనపెట్టి.. లోపాలను ఎత్తి చూపొచ్చు.. పరిష్కారాలు సూచించవచ్చు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేయవచ్చు. సద్విమర్శలు చేయవచ్చు. చురకలంటించవచ్చు. సమయానుకూలంగా సబ్జెక్టుతో మాట్లాడి.. మాట విలువ పెంచుకోవచ్చు. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవచ్చు. కానీ ఆయన ఏనాడూ ఈ పంథాలో వెళ్లినట్టు లేడు. రోజు రోజుకు మరింత దిగజారుతున్నాడు… ఇలా. ఓ ఫేక్ వార్తను వెనుకాముందు చూసుకోకుండా షరా మామూలుగా సాదాసీదాగా స్పందించే గుణాన్ని చాటుకుని అందరి చేత చివాట్లు తింటున్నాడు. ఇది చత్తీస్‌ఘడ్‌లో జరిగిన సంఘటన. కానీ వెలుగు పత్రిక దీన్ని భద్రాచలంలో జరిగినట్టు అచ్చేసింది. ఆరెస్ ప్రవీణ్ దీన్ని ఆసరా చేసుకుని ఇలా తనదైన శైలిలో బీఎస్పీ అధికారంలోకి వస్తే గ్రామానికో అంబులెన్స్ అని హామీ ఇచ్చేశాడు.