రాజమౌళి అంటే ఒక ఐదు నిమిషాలు చూసి “పారాసైట్” సినెమా బాలేదు, అసలు నచ్చలేదు అన్నాడు. మీకు ఏమి అయ్యింది, RRR అంతా చూసి కూడా బాలేదు అంటారు..?
RRR అని మొదట్లో టైటిల్ వేయకుండా అసలు ఒక R అంటే FIRE అని చూపించారు, ఇంకో R అంటే WATER అని చూపించారు. అసలు ఈ డైరక్టర్ కి ఉన్న క్రియేటివిటీ స్పిల్ బర్గ్ కి కూడా లేదు అందాం అనుకుంటే మూడో R అంటే ఏమిటో చూపించలేదు అని చెత్త వెధవ, చెత్త సినెమా, చెత్త డైరక్టర్ అంటే కుదరదు. క్రియేటివిటీ ని ఎంకరేజ్ చేయకపోతే ఎలా..?
సాధారణం గా తెలుగు సినెమాల్లో ఒకడు 100 మందిని కొట్టటం చూసే ఉంటాం. ఇందులో మొదటి సీన్ లోనే ఒకడు వేల మందిని కొట్టటం మామూలు విషయం కాదు. దీన్ని పిచ్చి తనం, లేకితనం అంటే ఎలా..? అదే క్రియేటివిటీ రా సామీ.
ఇలాంటివి చెప్పుకుంటే పోతే చాలా ఉన్నై కానీ సినెమా బాగాలేదు అనకండి, మీకు చేతనైతే సినెమా తీసి చూపించి అప్పుడు సినెమా బాలేదు అనండి.
ట్రైలర్ లో చూపించిన సీన్స్ మాత్రం బాగున్నై, అవి తప్ప ఏ ఒక్క సీన్ బాలేదు అని నేను కూడా ఒప్పుకుంటా. పాటలు బాలేదు, ఎమోషన్స్ లేవు, మోషన్స్ లేవు, స్టోరీ ఏమీ లేదు, సంగీతం అయితే పరమ రోత అని నేను కూడా ఒప్పుకుంటా కానీ బాలేదు అనకండి, మీరు కూడా ఒక సినెమా తీసి ప్రచారానికి 1000 కోట్లు ఖర్చు చేసి అప్పుడు బాలేదు అని చెప్పండి.
అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప ఓవర్ ఆల్ గా తీసుకుంటే బాలేదు అనకండి.1200 థియోటర్స్ లో రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు కాబట్టి మొదటి రోజే ఒక వంద కోట్లు వచ్చి ఉంటై.
చివరగా ఒక మాట కుక్క ని పదే పదే సింహం అని చెప్తుంటే జనాలు అందరూ సింహం అనే అనుకుంటారు కాబట్టి మనం కూడా అంతే అనుకోవాలి, అంతే కాని సినెమా బాలేదు అంటే ఎట్టా కుదురుద్ది రా నాయనా..? అంతగా రుద్దీ రుద్దీ రుద్దినా బాలేదు అంటే ఎలా..? మీకు సెన్స్ లేదు, సినెమా సెన్స్ లేదు.
కరణ్ జోహార్ తెలివైనోడు కాబట్టి హింధీ లో కొనలేదు లేకపోతే తన 40 సంవత్సరాలలో సంపాదించింది అంతా వారం లో పోయేది. అయినా వేల కోట్లు కలెక్ట్ చేసింది అనే మాటలని నేను అయితే నమ్ముతా..నాకు తెలిసి ఈ సినెమా 5000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. 30% ట్యాక్స్ కట్టాలి కాబట్టి 1500 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ రావాలి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ చివరివరకు ఎంత కడతాడో చూద్దాం. అప్పటివరకు సినెమా బాలేదు అనకండి.
మరీ చెత్తగా అయితే లేదు. చూడాలి అనుకుంటే ఒకసారి చూస్తే తప్పు లేదు. హైప్ చేసినంత లేదు, లాజిక్స్ అయితే అసలు వెతక్కూడదు. ఇది పాన్ ఇండియా సినెమా కాదు, పాన్ వరల్డ్ సినెమా. దీన్ని కొరియా, ఉక్రెయిన్ బాషల్లో కూడా రిలీజ్ చేయాలి…!
మై రేటింగ్ : 10/5 (సప్పుడు ఎక్కువ, సరుకు తక్కువ )
– సగటు సినెమా అభిమాని
Jagannadh goud