సారీ.. నాకు ఓటు లేదు..
రెండేండ్లు దాటిపోయింది మెంబర్ షిప్ కోసం అప్లయ్ చేసి… దిక్కూ దివానం లేదు… అసలు ఒస్తదో రాదో కూడా తెల్వదు… ఎందుకంటే పైరవీకారులకే ప్రెస్ క్లబ్బుల ఫస్టు ప్రిఫరెన్సనే టాకుంది బయట. గత ఎన్నికల సమయంల ఓటర్ల జాబితా చూసినప్పుడే నాకు ఆ ముచ్చట అర్థమైంది. జర్నలిజంతో సంబంధం లేనివాళ్లు ఎందరో అందులో ఉన్నారు. మరి, రోజంతా వార్తల సేకరణలో, ప్రచురణలో, ప్రసారంలో బిజీగా ఉండే మేమెవరం అనే అనుమానం వచ్చింది. చానా బాధ కూడా అయ్యింది. నేనే కాదు నాలాంటోళ్లు వందలు, వేలున్నారు. వాళ్లందరిదీ నాలాంటి ఆవేదనే.
నిఖార్సయిన జర్నలిస్టులు ఎవరైనా ప్రెస్ క్లబ్ లో ఉంటే దీనికి సమాధానం చెప్పాలె. బట్ చెప్పరు. ఎందుకంటే వాళ్లు సీఎంఓ పేషీ కంటే బిజీ.
బట్ ఎప్పుడూ టైం ఒక్క లెక్కుండదు. పుట్ట పగిలే సమయమొస్తది.
మెంబర్ షిప్ కోసం ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు నామినేట్ చేసుడేందో.. వాళ్ల సంతకాల కోసం వెంపర్లాడటమేందో… ఇదేం ఖర్మ.. ఏళ్లుగా జర్నలిజంలో ఉంటూ నేనూ జర్నలిస్టునని ఒకరితో సర్టిఫికెట్ ఇప్పించుకునే దుస్థితెందుకు??? నిజంగా మెంబర్ షిప్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలంటే ఇది కాదు పద్ధతి.
ఆఖరికి అక్రిడేషన్లు, జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలోనూ ఇదే దుస్థితి. గొట్టాం గాడెవడో తెలియదు.. కానీ వాడికి అక్రిడేషన్,హెల్త్ కార్డు ఉంటది.. వాడి వివరాలు చూస్తే గల్లీ దాటని ఒక సిల్లీ పేపరో, న్యూస్ ఛానలో ఉంటది.
ఇక ఓ సింగిల్ పేజీ పేపర్ స్టార్ట్ చేసి.. దాన్ని పైరవీలతో ఐ అండ్ పీఆర్ లో రిజిస్టర్ చేయించుకుని రాష్ట్రవ్యాప్తంగా అక్రిడేషన్ కార్డులను జిల్లాను బట్టి రేట్లు ఫిక్స్ చేసి అమ్ముకునే సీనియర్ జర్నలిస్టు మహానుభావులు కోకొల్లలు (అందరూ కాదు).
పేరుమోసిన మీడియా సంస్థల్లో ఏళ్లుగా పని చేస్తూ.. ఇదేం దుస్థితన్నా మనకు..
బాధేస్తోంది.. నిజంగా బాధేస్తోంది.. నిజమైన జర్నలిస్టులం అయ్యుండి జర్నలిజానికి ఏమీ కానివాళ్లం అయ్యామా అని చాలా బాధేస్తోంది.. అంతకుమించి జాలేస్తోంది…
Lines from : Santosh Kumar Pyata