– ఎవరి ముడ్దిక్రిందకి నీళ్ళు వస్తే, అప్పుడు కానీ వాడు నిద్ర లేవడు . జీతాలు కోత పెడితేగాని ఉద్యోగికి పెట్టిన వాతలు కనబడలేదు . సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే కానీ సినిమా హీరోలకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటుంది అని తెలియలేదు.

– రైతుల పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దారుణంగా దెబ్బతిని రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు ఒడికడుతున్నప్పుడుకాని మీ వెనుక మేమున్నామని భరోసా ఇచ్చిన ఉద్యోగ సంఘాలు కానీ , సినీనటులుకాని ముందుకి రాలేదు.

– ముప్పై మూడు వేల ఎకరాల బంగరు భూమి రాజధానికోసం ఇచ్చిన రైతులు కన్నీళ్ళతో ఉద్యమం చేస్తుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని కూసినప్పుడు కానీ , అందరు ఆండ్రోయిడ్ ఫోన్లు పట్టుకొని ఖరీదైన చీరలు కట్టుకుని పాదయాత్రకొచ్చారు , వీళ్ళేమి పేద రైతులని ఎగతాళి చేసినప్పుడు కానీ , రైతులంటే కట్టుకోవడానికి బట్టలు కూడ లేకుండా ముష్టి ఎత్తుకుంటారా ??? అని ఒక్క ఉద్యోగి కానీ , ఒక్క సినిమా హీరో కానీ ప్రశ్నించలేదు సరికదా కనీసం సానుభూతి ప్రకటించలేదు . ఇప్పుడు కాస్త జీతం తగ్గితే ఎన్ని రకాల లెక్కలో, ఎన్ని శాపనార్దాలో, ఎన్ని ఉద్యమాలో, ఎన్ని బెదిరింపులో !!!

– అందుకే ఉద్యోగుల జీతం తగ్గిస్తే , సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే , ఏ సామాన్య ప్రజలూ కనీసము సానుభూతి వ్యక్తం చెయ్యడం లేదు సరికదా ఆనందిస్తున్నారు . అందుకే సాటి వారు కష్టాలలో ఉన్నప్పుడు కూడ కొద్దిపాటి మానవత్వం తో కూడిన సానుభుతి ప్రదర్శించడం నేర్చుకుంటే మనము కష్టాలలో ఉన్నప్పుడు ఇతరులనుండి సానుభూతి ఆశించే అవకాశం ఉంటుంది.

You missed