రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి!
రెడ్డి సంఘాల ఐక్యవేదిక డిమాండ్
హుజురాబాద్ ఎన్నికల్లో, అంతకు ముందు 2018 ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విధంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రెండు వేల కోట్లతో చట్టబద్ధత కల్పిస్తూ రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
రెడ్డి సంఘాల ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అంతరెడ్డి విజయ పాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి పలు సూచనలు, డిమాండ్లు చేశారు.
– వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తింపజేయాలి.
– 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు నెల నెలా 5000/- వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.
– ప్రతి నియోజకవర్గంలో ఒక జనరల్ గురుకులం ఏర్పాటు చేయాలి.
– ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
సమావేశంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు సంపత్‌రెడ్డి, చింటు రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పవన్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.