పంది మాంసం తింటే పంది బుద్ధులు వస్తాయి
మేక మాంసం తింటే మేక బుద్ధి వస్తుంది
కోడి గుడ్డు తింటే కోడి బుద్ధే వస్తుంది. పెంటమీది కోడి పొడుచుకొని తిన్నట్టే మనిషి బుద్ధి ఉంటది
….
ఇదీ చినజీయర్ అనబడే ఓ ధనిక స్వామి చెప్పిన ప్రవచనం
…
అయ్యా..
బండను బద్ధలు కొట్టే నా ఒడ్డెర సోదరుడు పొద్దున పందికూర తినకుంటే మరి సుత్తె లేవదు. బండ నసగదు.
నా గౌడన్న రాత్రికి ఇంత నీసు ముడితేనే పొద్దున తాడు ఎక్కగలడు. లేదంటే కాళ్లీడుసుకపోతయ్.
పట్నంల సుతారిపని, ఉప్పరి పని చేసే కష్టజీవులు రోజూ ఓ గుడ్డు, వారానికింత కోడి కూర తినకుంటే ఇసుక, యిటుక బస్తా భుజాన వేసుకొని ఐదంతస్తుల మేడపైకి ఎక్కలేడు. పొద్దుందాక పని చేయలేడు.
ఎవుసం జేసే రైతన్న.. నెలకోసారన్న కవుసు ముట్టకుంటే గొడ్డు కష్టం చెయ్యగలడా?
……………
ఇలా ఒక్కొక్కరి అవసరాలను బట్టి వారి ఆహార అలవాట్లు ఉంటాయి, మీరు పొద్దున లేస్తే మాటలు అమ్ముకొని బతుకుతారు. మీలాగా అందరికీ సాగుబాటు రాదుకదా!
…………..
ఇంతకూ మనిషి ఆహార అలవాట్లు ముందు పుట్టాయా?
శాస్త్రాలు ముందు పుట్టాయా?
……
ఏ జీవికైనా పుట్టుకతోనే ఏర్పడే మొదటి అవసరం ఆకలి కదా?
అంటే ఆహార అలవాట్లే ముందు పుట్టాయి.
……
మీలాంటి సన్నాసులకు బడుగు, బలహీన వర్గాల అలవాట్లను హేళన చేయటం ఈ మధ్య ఫ్యాషనైపోయింది.
………..
మేం కట్టుకొనే బట్టపై మా ఇష్టం ఉండదు
మా తిండిపై మా అజమాయిషీ ఉండదు
మా బతుకుపైనే మాకు హక్కు ఉండదు
…….
అంతా మీరు చెప్పినట్టు నడువాలి.. అంతేనా?
…..
ఇంతకూ మీరు తినే ఆకులు, దుంపలు, కూరలు.. మేకలు, పశువులు తింటాయి కదా? మరి మీది పశువు బుద్దేనా?
…..
ఇతరుల అలవాట్ల గురించి మాట్లాడేటప్పుడు వాటి వెనుక కారణాలను తెలుసుకోవాలి
…
శాఖాహారం మంచిదే.. కానీ దాని గురించి చెప్పే విధానం ఇది కాదు..
….
ఇంతకూ మనమంతా పూజించే రాముడు, కృష్ణుడు పుట్టింది క్షత్రియులుగానే కదా? ఆ తర్వాతే దేవుళ్లు అయ్యారు కదా?
వేట క్షత్రియ ధర్మం కదా? మరి వేటాడిన జంతువులను వాళ్లు తినలేదా?
….
ఇంతపెద్ద సామిని.. ఇట్ల అంటవ అని కొందరు గుస్స కావచ్చు.. చినజీయర్ అవమానించింది ఈ ఒక్క జనరేషన్ ను మాత్రమే కాదు.. నా పూర్వీకులను కూడా..
అయినా సరే.. అట్ల ఎట్ల అంటవని అంటారా? నేను ఈ దేశ పౌరుడిగా.. నా సంపాదనలో సర్కారుకు పన్ను కడుతున్న..కాబట్టి ఇక్కడ నాకు కొన్ని హక్కులు కూడా ఉన్నవి.. మరి ఆ చినజీయర్ కడుతున్నాడో లేడో తెలువది..
(Venu Bekkam)