ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అనేది ఉత్త ప్రచారమేనట. ఈ రోజు అధికారంగా ధృవీకరించారు. వాస్తవానికి ఓమిక్రాన్ విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయే తప్ప.. నైట్ కర్ఫ్పూ, లాక్ డౌన్ ల జోలికి వెళ్లడం లేదు. నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. మాస్కలు ధరించి ముందు జాగ్రత్తలు పాటిస్తే.. ఒకవేళ కరోనా వచ్చినా.. మందులతో తగ్గిపోతున్నది. ప్రాణాలు పోయేంత ప్రమాదం ఏమీ పొంచిలేదు. అవసరంగా నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లతో మరింత ఆర్థిక ఇబ్బందులు, జనాలకు కష్టాలు తప్పితే ఒరిగేదేం లేదు…