జనవాడే సంగప్ప.. వీ6లో ఓ వెలుగు వెలిగిన జర్నలిస్టు.. చాలా మంది ఇష్టపడతారయన్ను. కానీ ఎమ్మెల్యే కావలన్న ఆయన కోరిక జర్నలిజానికి గుడ్ బై చెప్పించేసింది. బీజేపీలో చేరాడు. టీవీ స్క్రీన్ మీద దడదడలాండిచెటోడు.. ఇప్పుడు ప్రెస్‌మీట్లల్ల బండి సంజయ్ వెనుక కూర్చుని కొద్దిగా టీవీల్లో ముఖం కనిపిస్తే చాలు అనుకునే కాడికి ఒచ్చిండు పాపం. ఆయన తంటాలేవో ఆయన పడుతుండు. ఎమ్మెల్యే కావాలె. గాడ్ ఫాదర్ వివేక్ ఉండనే ఉన్నడు. ఎట్లైనా టికెట్ ఇప్పిస్తడు. గెలుసుడా ఓడుడా తర్వాత సంగతి. తన ఫేస్ బుక్ వాల్ మీద కూడా బండి సంజయ్‌తో దిగిన ఫోట్వనే పెట్టుకున్నడు. ముందు జాగ్రత్తగా. రాజకీయ నాయకుని లక్షణాలు బాగానే అబ్బినయి.
అంతా మంచిగనే ఉంది కానీ, వీరశైవ లింగాయత్‌లో ఓబీసీల్లో చేర్చాలనో ఇంకేదో డిమాండ్‌తో కలిశారు కులబాంధవులంతా కలిసి. అదెక్కడి పేపరో.. దాని పేరు కూడా సరిగా లేదు. దాంట్లో మాత్రమే ఈ వార్త వచ్చినట్టుంది. మన మాజీ విలేకరీ సాబ్ కనీసం అందులో వచ్చిన వార్తనన్నా సరిగ్గా చదివిండో లేదో తెల్వదు కానీ, దాన్ని కండ్లకద్దుకుని తన ఫేస్‌బుక్ వాల్ మీద పెట్టేసుకున్నడు. తాము పోయి కలిసినం. వినతి పత్రం ఇచ్చినం. అని. ఏమని ఇచ్చిండ్రు.. ఏం కావాలని అడిగిండ్రు.. ఆయన ఏం చేస్తానని మాటిచ్చిండు… ఈ విషయాలు మాత్రం ఆ పేపర్ వార్తలో లేవు.
అంత సస్పెన్స్ వార్త బహుశా ఏ వార్త మీడియా హౌజ్‌నుంచి ఇంత వరకు వచ్చిండదు. అగో అట్లాంటిదాన్ని మన జనవాడే అన్నా ఇట్ల తన ఫేస్‌బుక్కులో పెట్టేసుకుని బుక్కయ్యిండు. నువ్వు ఎంత బిజీ ఉంటే మాత్రం… వార్త ను చూసుకోకుండానే ఎట్ల పోస్టు చేసుకున్నవే అన్న.. విలేకరుల ఇజ్జత్ తీసినవ్ పో.