జర్నలిస్టు : కేంద్రం యాసంగి ధాన్యం కొనటం లేదన్న కేసీఆర్ విమర్శలపై మీరేమంటారు?
పువ్వు లీడర్ : ఈ దేశంలో పుట్టి.. బంగ్లాదేశ్ ని పొగుడుతాడా.. కేసీఆర్ దేశద్రోహి
జర్నలిస్టు : కేంద్రం ఎంత కోటా ధాన్యం కొంటుందో చెప్పాలనే డిమాండ్ కి మీ సమాధానం
పు.లీ : ఒక ముఖ్యమంత్రి అయి ఉండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తాడా?
జర్నలిస్టు : యాసంగి ధాన్యాన్ని కొనలేమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ చేతకానితనానికి పరాకాష్ట అనే విమర్శలకు మీ సమాధానం?
పు.లీ : అసలు కేసీఆర్ వాడిన పదజాలం పద్ధతిగా లేదు
జర్నలిస్టు : రైతుల కల్లాల దగ్గరికి బీజేపీ యాత్రను ఎందుకు మధ్యంతరంగా ఆపేశారు?
పు.లీ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎగిరేది బీజేపీ జెండానే..
జర్నలిస్టు : వ్యవసాయ చట్టాలు తేవడం పొరపాటు చర్య కాబట్టే ఆ చట్టాల్ని వెనక్కి తీసుకున్నారా?
పు.లీ : కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు..
జర్నలిస్టు : ప్రపంచ ఆకలి సూచికలో 116 దేశాల్లో ఇండియా 101వ స్థానంలో ఉంది. దీనిపై మీ కామెంట్..
పు.లీ : వందకు ఒకటి ఎక్కువనే ఉన్నాం.. మోడీ పాలనతోనే ఇది సాధ్యం.
జర్నలిస్టు : ఆకలి సూచీలో పాకిస్థాన్ 92, బంగ్లాదేశ్ 76వ స్థానంలో ఉన్నాయి.. కదా ఈ విషయం తెలుసా మీకు?
పు.లీ : బీజేపీ పాలనలో త్వరలో 116వ స్థానానికి వెళ్తాం.. పాక్, బంగ్లాలు మనల్ని టచ్ కూడా చేయాలేవు.
జర్నలిస్టు : గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా స్థానం 96 నుంచి 101కి పడిపోయింది.. దీనిపై మీరేమంటారు.
పు.లీ : అక్కడ పెరిగిదండీ.. చూడండి.. 96 కంటే 101 ఎక్కువే కదా.. వంద కంటే కూడా పైనే ఉంది. అది గమనించాలి.
జర్నలిస్టు : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది బీజేపీ ప్రభుత్వం కాదా..?
పు.లీ : కేసీఆర్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించాలి
జర్నలిస్టు : ఢిల్లీలో రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతుల మరణానికి కేంద్రం బాధ్యత వహిస్తుందా?
పు.లీ : వాళ్లు రైతులు కాదు.. ఖలిస్తాన్ ఉగ్రవాదులు

 

Praveen kumar Sunkari

You missed