ఏపీ రాజకీయాలు మరీ భ్రష్టు పట్టిపోయాయి. అక్కడ ఆధిపత్య రాజకీయం కోసం, పదవుల కోసం, సీఎం సీటు కోసం ఎంతగా దగజారుతున్నారంటే.. బట్టకాల్చి మీదేయడం కాదు.. బట్టలిప్పేసుకునే వరకు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అసందర్భ ప్రేలాపనలు అక్కడ రాజ్యమేలుతున్నాయి. ఒకర్నొకరు మానసికంగా దెబ్బతీసి, మళ్లీ లేవకుండా చేసుకుని, పది కాలాల పాటే తామే అధికారాన్ని చెలాయించేందుకు .. ఎంతటి దారుణాలకైనా తెగబడే పరిస్థితికి వచ్చారు.
ఏపీ రాజకీయాలంటేనే మిగిలిన వారికి రోత పుట్టేలా చేసుకున్నారు. అసెంబ్లీలో ఎవరో చంద్రబాబు నాయుడు సతీమణికి కించిపరుస్తూ మాట్లాడారనే దానిపై రచ్చ మొదలైంది. వైఎస్సార్ సీపీ రాజకీయ విలువల్లో మరీ దిగజారి పాతాళానికి పడిపోయింది. అసలు చంద్రబాబు సతీమణి టాపిక్కే అవవసరం. రాజకీయంగా ఎదుర్కోవాలంటే చాలా ఇష్యూలు మాట్లాడుకోవచ్చు. కానీ కొత్త ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపింది జగన్ సర్కార్.
యథా రాజా తథా ప్రజా అన్నట్టు జగన్ మనస్తత్వం ఎరిగిన నేతలంతా చంద్రబాబును ఎంతగా ఇబ్బంది పెట్టి, మానసికంగా ఏడిపిస్తే.. తమ బాస్ వద్ద అంత మంచి మార్కులు కొట్టేయవచ్చు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందులోంచి పుట్టుకొచ్చిందే చంద్రబాబు సతీమణిపై అభండాలు వేయడం. చంద్రబాబు కూడా దీన్ని వదల్లేదు. తను ఇంకా దిగజారిపోయి… ప్రెస్‌మీట్ పెట్టి భోరును ఏడిచాడు. సమాజం నుంచి తనకు సానుభూతి కావాలని బలంగా కోరకున్నారు. నందమూరి వంశం మద్దతు కావాలనుకున్నాడు. అది దక్కింది. అంత వరకూ సక్సెసే కానీ, ఇవి మరీ విలువలు లేని రాజకీయాలు అనేవి అందరికీ తెలసిపోయింది.
అసలు అసెంబ్లీలో ఏంజరిగిందో ఎవరి తెలియదు. అదంతా ఆన్ రికార్డ్. కానీ టీడీపీ వాళ్లే.. సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ పార్టీ చంద్రబాబు సతీమణిపై అభాండాలేసి పైశాచికానందం పొందితే.. ఇలా కొన్ని మీడియా ఛానళ్లు కోడి గుడ్డు మీద ఈకలు పీకి…. దీని పై లోతుగా విశ్లేషణ చేసి.. అసలు నిజాలేంటో తెలియజేస్తున్నామనే బిల్డప్‌లిస్తూ.. మరింత దిగజారిపోతున్నారు. దీనిపై ఇప్పుడు నిజనిజాలు అవసరమా..? అసలు ఆ ఆరోపణలు అవసరమా..? ఇంత రాద్దాంతం అవసరమా..? అవసరమే. ఈ రెండు పార్టీలకు. చూస్తే చూడండి.. వింటే వినండి. లేకపోతే నోరు మూసుకోండి. మా రాజకీయాలు మా ఇష్టం.అంతే.
