చంద్రబాబు మీడియా ముందు బోరున విలపించిన సంఘటన పై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు. సాధారణ మానవులు భావోద్వేగాలను తట్టుకోలేరు. కానీ కొందరు మాత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటారు. వారి అనుభవం, వారి నడవడిక ఆ విధంగా వారిని అలా తయారు చేస్తుంది. వీరు సాధారణ మానవుల కన్నా స్పందనలో భిన్నంగా ఉంటారు. చిన్న విషయాలే కాదు.. పెద్ద సంఘటనలకు కూడా చలించరు. గంబీరంగానే ఉంటారు. భావోద్వేగాలు వారి కంట్రోల్‌లోనే ఉంటాయి. కంట్రోల్ తప్పి ప్రవర్తించరు. కానీ బాబు మాత్రం బోరున మీడియా ముందు ఏడవటం ఒకింత షాక్‌కు గురిచేసింది. ఆయన అలా ఏడ్చాడంటేనే తనకు తాను మరింత బలహీనమయ్యాయని చెప్పడమే అన్నాడు ఆర్జీవీ. ఒక సంఘటన కోపం తెప్పించవచ్చు. కానీ ఏడుపు దాకా ఆ పరిస్థితి వెళ్లిందంటే.. ఆ మనిషి మాములు సాధారణ మనిషే. మరి లీడర్ ఎలా అవుతాడు…? అని అన్నాడు.