కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి ఈ క్రింది కొన్ని ఉదాహరణలు.

1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి.

2. 2009 ఎలక్షన్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు.

3. మహా పండితుడు, మహా మేధావి అయిన, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 420 case లో బోనులో నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.

4. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి కనీసం బాడీ కూడా దొరకలేదు.

5. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు జైలులో ఉన్నారు.

6. 1978 లో భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.

7. తమిళ ప్రజలతో “అమ్మ” అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు.

8. ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.

9. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.

10. జాత్యహంకారానికి, రాక్షసత్వానికి మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

11. కాలం చేసే విచిత్రమైన ఎగ్జాంపుల్ తో ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాత గా, గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా దేశమంతా గొప్పపేరు సంపాదించాను అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు NDA కన్వీనర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి విఫలం చెందిన నరేంద్ర మోడీ, భారతదేశ ప్రధాన మంత్రి అయ్యాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ, కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అయ్యి చంద్రబాబు నాయుడిని 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి!

ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

ఈ సృష్టి అంతా కాలస్వరూపం. కాలమే దైవం. మనల్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చేది కాలం, మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకు వెళ్ళి పోయేది కాలం.

అందువల్ల “నేనే” అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు. ఈ నేనే అన్న అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషికి కొంత ఫిలాసఫీ, ఆధ్యాత్మికత అవసరం
………………………………………………………………………………………………………………………………….

ఇది నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌స్తోంది. దీన్ని చూస్తేంటే బాబుకు సంబంధించిన టీమే ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్న‌ట్టు అనిపించింది. చివ‌రాఖ‌రులో నేనే అన్న అహంకారంతో విర్ర‌వీగ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు అన్న ప‌దం ఎవ‌రినుద్దేశించి రాశారో గానీ, ఇక్క‌డ మాత్రం చంద్ర‌బాబుకు వంద‌కు వంద‌శాతం న‌ప్పుతుంది. ఇంత జ‌రిగినా.. ఇంకా నేనే చేశాను… నేనే ఉద్ద‌రించాను… నా వ‌ల్ల ఇదంతా జ‌రిగింది. నా కోస‌మే దేశాధినేత‌లు రాష్ట్రానికి వ‌చ్చారు. నా రాక కోసం పెద్ద‌పెద్దోళ్లు గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసెటోళ్లు.. ఇగో ఇసొంటి మాట‌లు మాట్లాడి మాట్లాడే ఇక్క‌డ దాకా తెచ్చుకున్నాడు. మ‌నిషి ఇంకా మారాలె. మారాల‌ని ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు. కొన్ని జీవితాలంతే.

You missed