భాస్కర్ రాజా రవీంద్ర.. జెమినీ టీవీలో Jr NTR ముఖ్యఅతిథిగా నడిచే షో.. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకున్న విజేత..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన టువంటి. విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి శ్రీ బి. వి ఎస్ ఎస్ రాజు , శేషు కుమారి దంపతుల కుమారుడే ఈ భాస్కర రాజా రవీంద్ర..
ధర్మపత్ని సింధుజ..కుమారుడు దేవాన్ష్ కార్తికేయ..కూతురు కృతి అన్విక..
1989 to 1997 వరకు మధు విద్యాలయం వైరాలో ప్రాథమిక విద్యాభ్యాసం..
1999 to 2003 వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.
ఈ బీటెక్ ఎంఏ ఎల్.ఎల్.బి.
చదివిన రవీంద్ర 2012లో పోలీస్ శాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని సర్కిల్.
ముత్తారం పిఎస్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. 2015 నుంచి నేటి వరకు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో విధులు నిర్వహిస్తూ… నేడు సి. ఐ.డి సైబర్ క్రైమ్‌లో
విధులు నిర్వహిస్తూ ఉన్నాడు..
మరో కోణంలో ఉద్యోగ బాధ్యతల రీత్యా పోలీస్ శాఖలో 2015 నుంచి పిస్టల్, రైఫిల్ కాంపిటేషన్ లో
తెలంగాణ పోలీసు శాఖ నుంచి వివిధ కాంపిటేషన్ లో పాల్గొన్నాడు.
2016లో పుణె లో జరిగిన షూటింగ్ కాంపిటేషన్ లో ఎయిర్ రైఫిల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2017 లో గౌహతి లో జరిగిన షూటింగ్ కాంపిటేషన్ లో ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2019లో తెలంగాణ పోలీస్ శాఖ నుండి ఆలిండియా పోలీస్ పిస్టల్ కాంపిటీషన్ లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. అంతేకాకుండా 2018-19 చైనాలో జరిగిన వరల్డ్ పోలీస్ షూటింగ్ కాంపిటేషన్ లో పాల్గొన్నాడు. భవిష్యత్తులో భారతదేశం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఒలంపిక్ పోటీల్లో పాల్గొని
భారతదేశానికి ప్రపంచ పటంలో పతకాల పట్టికలో గర్వించే విధంగా ఉండాలని పుట్టిన ఊరు, రాష్ట్రానికి మరింత పేరు రావాలని కోరుకుంటూ..
భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, హృదయ పూర్వక అభినందనలు 💐
మీ గ్రామస్తులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్,👍💐
(సోర్స్: సోషల్ మీడియా)