త్రిపుల్ ఆర్ సినిమాలో ఈ మధ్య రిలీజ్ చేసిన నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఆ పాట పై విమర్శలు కూడా అదే స్థాయిలో దాడి చేస్తున్నాయి. చంద్రబోస్‌తో ఓ నాటు ఆట కూడా ఆడేసుకుంటున్నాయి. సరే, అది వదిలేస్తే.. ఈ పాటకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేసిన మాస్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. పాటకు తగ్గట్టుగా కీరవాణి మాస్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ స్పీడ్ మ్యూజిక్ తగ్గట్టు స్టెప్పులు కంపోజ్ చేశారు.
ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. దుమ్ము దులిపారు. ఈ డ్యాన్సుకు అంతా ఫిదా అవుతున్నారు. వీరిద్దరి నాటు డ్యాన్సు స్టెప్పులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎన్నో టేకులు తీసుకుని, ఎన్నో సార్లు కిందామీద పడి ప్రయత్నం చేస్తేగానీ ఈ స్టెప్పులు వర్కవుట్ కావు.
కానీ మన లోకల్ టాలెంట్ ఈ స్టెప్పులను అవలీలగా చేసి చూపుతున్నారు. ఈ మట్టిలో మాణిక్యాల టాలెంట్ ను ఎవరూ గుర్తించరు. ఇగో ఇలా సోషల్ మీడియానే వారికి వేదిక.