దగ్గరగా .. రా. దగ్గరగా రా…
ఇది క్లోజప్ యాడ్. కరోనా రాకముందు ఈ యాడ్ బాగా ఫేమస్. ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ ఎంటరైందో అప్పట్నుంచి దీన్ని ఎత్తేశారు. భౌతికదూరం పాటించండి.. మాస్క్ ధరించండి.. అని చెవులకు చిల్లులు పడేలా .. ఏ టీవీలో చూసినా.. ఏ ఫోన్ డయలర్ టోన్ చూసినా అదే. దీంతో ఈ క్లోజప్ యాడ్ మూతపడ్డది. క్లోజప్ అమ్మకాలపైనా ఇది ప్రభావం చూపింది. కరోనా వేళ ..తమ మార్కెట్‌ను రెట్టింపు చేసుకునేందుకు ఎవరి తంటాలు వారు పడ్డారు.
కరోనా నేపథ్యంలోనే కొత్త యాడ్‌లు తీసి వదిలారు మార్కెట్లో. సబ్బులు, హ్యాండ్ వాష్‌లు, ఆఖరికి ఇల్లు తుడిచే లైజాన్ వరకు అన్నీ మావి వాడండి .. మావి వాడండి.. కరోనా మీ దరి చేరదు.. క్రిములను చంపుతుంది అని కొత్త యాడ్‌లను వదిలారు. పాపం క్లోజ్ అప్ మాత్రం తన యాడ్‌ను క్లోజ్‌చేసుకుంది. అమ్మకాలు క్లోజ్ అయినంత పనైంది. ఇప్పుడు కరోనా భయం పోయింది… మళ్లీ తను ఫేమస్ అయిన దగ్గరగా.. రా అనే సాంగ్‌తోనే యాడ్‌ను రిలీజ్ చేసి మార్కెట్లో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తుందది. మనుషులు దగ్గరగా వచ్చి మాట్లాడే పరిస్థితే లేకుండా చేసే కరోనా వస్తుందని ఎవరూహించారు. ఇప్పడు మెల్లగా అంతా సద్దుమణుగుతుంది. మూడో వేవ్ భయం బూచి ఇంకా ప్రచారంలోనే ఉంది. ఆ భయం ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంది.
https://youtu.be/xR9YGePlC70