పొలం గ‌ట్టు దుమ్ములోన పొట్ల గిత్త దుంకిన‌ట్టు..
పోలేర‌మ్మ జాత‌ర‌లో పోత‌రాజు ఊగిన‌ట్టు..
కిర్రు చెప్పులేసుకోని క‌ర్ర‌సాము లేసిన‌ట్టు..
మ‌ర్రిచెట్టు నీడ‌లోన కుర్ర‌గుంపు గూడిన‌ట్టు…
ఎర్ర‌జొన్న రొట్టెలోన మిర‌ప‌తొక్కు క‌లిపిన‌ట్టు..

నాపాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..

నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు.. నాటు నాటు నాటు నాటు నాటు ప‌చ్చి మిర‌ప లాగ పిచ్చ‌నాటు..

త్రిపుల్ ఆర్ సినిమాలో మ‌రో పాటు నాటు నాటు పాట రిలీజ్ చేశాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. చంద్ర‌బోస్ రాసిన ఈ పాట ప‌దాల త‌న‌క‌నుకూలంగా మ‌లుచుకుని మొత్తానికి నాటు కోడి కూర చేద్దామ‌నుకున్నాడు కానీ.. దెబ్బ‌కొట్టింది.

ఎర్రొజ‌న్న రొట్టెలోన మిర‌ప‌తొక్కు క‌లిపిన‌ట్టు.. అన్నాడు ఓ ద‌గ్గ‌ర‌. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో ఎర్ర‌జొన్న‌లు ఎక్కువ‌గా పండుతాయి. ఇవి గ‌డ్డి విత్త‌నాలు. దీనితో రొట్టెలు చేయ‌రు. పేరుకు ఎర్ర జొన్న‌లే కాని గ‌డ్డి విత్త‌నాలు. మ‌నుషులు తిన‌డానికి ఇవి ప‌నికిరావు. కానీ చంద్ర‌బోస్ ఈ జొన్న‌ల్లో ఎర్ర అనే ప‌దం ఉంద‌ని, అది త‌న నాటు పాట‌కు సూట‌వుతుంద‌ని దీన్ని స్వేచ్చగా వాడేసుకున్నాడు.
జొన్న‌లైతే చాలు అవి రొట్టెకు ప‌నికొచ్చేవే అనుకున్నాడు. ఈ ఎర్ర‌జొన్న‌ల చ‌రిత్ర ఆయ‌న‌కు తెలియ‌న‌ట్టుంది. తెలుసుకునే ప్ర‌య‌త్న‌మూ చేయ‌న‌ట్టుంది. ఇవి ప‌శువుల దాణా కోసం వాడుతారు.

You missed