కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం అందరినీ కలిచివేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీతో కూడా ఆయనకు పరిచయం ఉంది. పలువురు నటులు సంతాపం తెలిపారు. చాలా మంది తెలుగు వాళ్లకు పునీత్ గురించి పెద్దగా పరిచయం లేదు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మృతి చెందడం అందరినీ బాధించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆర్జీవీ తనదైన శైలిలో.. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు..అందుకే బతికినన్నాళ్లు ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌లో బతికేయాలన్నాడు. రాజ్‌కుమార్ గురించి ఫేస్‌బుక్కులో సాయంత్రం నుంచి ఓ మెస్సేజ్ చక్కర్లు కొడుతున్నది. 45 ఫ్రీ స్కూళ్లు, 26 అనాథాశ్రమాలు,16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, 1800 మంది విద్యార్థులకు చదువు, రెండు కళ్లు దానం..
ఇవన్నీ అతన్ని నిజజీవితంలో కూడా రియల్ హీరోగా, సూపర్ స్టార్‌గా నిలబెట్టాయి. చాలా మంది రాజ్‌కుమార్ జీవితం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతూ.. అతని అకాల మరణానికి చింతిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్ని రోజులు బతికి ఉన్నామని కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యము. రాజ్‌కుమార్ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. తొందరగా జీవితం ముగించడమే విషాదం.