ధరణి.. లోపాల పుట్ట. కానీ ఎవరూ ఇప్పటి వరకు దీనిపై కోర్టు మెట్లెక్కలేదు. ఏడాది తర్వాత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా హై కోర్టు తలుపు తట్టాడు. హైకోర్టు ఈ కేసును అడ్మిట్ చేసుకుని గవర్నమెంట్‌కు నోటీసు ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం. ఇది ఓ రకంగా రైతుల విజయమే. ఆరువారాలకు హియరింగ్ వాయిదా వేసినా.. రిలీఫ్ వస్తుందనే ఆశ లేకున్నా.. హైకోర్టు దీన్ని స్వీకరించడమే ఇందులో తప్పులున్నాయని ఒప్పుకున్నట్టు. ఇక్కడే ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మాట్లాడితే దీనిపై గొప్పల డప్పులు కొట్టుకునే సీఎం.. దీన్ని అంగీకరిస్తాడా? కోర్టు ఆదేశాలు పాటిస్తాడా? సమర్థించుకుంటాడా? సమర్థింపుకే ఎక్కువ అవకాశం ఉంది.
లోపాలేంటీ..? సర్కార్ ఏం చేసింది..??
-ధరణి రెవెన్యూ రికార్డులో తప్పొప్పులుంటే సవరించుకోవడానికి అవకాశం లేదు. రెవెన్యూ రికార్డుల్లో తప్పొప్పులు కూడా సరిచేసుకునే అవకాశం ఇవ్వని ఏకైక చట్టం ఇదే. ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టం లేదు. తెలంగాణలో 1936 నుంచి ఆర్వో ఆర్ చట్టాలున్నాయి. ఇది నాలుగో చట్టం. రికార్డులు రాసుకునే వాడే తప్పులుంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.
– ధరణిలో సవరణలు చేయడానికి ఇచ్చిన ఆప్షన్లకు ఏ చట్టబద్దతా లేదు. కలెక్టర్ ఏ అధికారాలతోని ధరణలో సవరణలు చేస్తున్నాడు.? అసలు చాలా వాటికి చేయడమే లేదు. చేసేవాటికి చట్టబద్దత లేదు. హైకోర్టుకు ప్రధానంగా రిక్వెస్టు చేసిందేందంటే.. ఆర్వోఆర్ చట్టంలో గ్రీవెన్స్ రీ డ్రెస్సల్ మెకానిజమ్ పెట్టించేట్టు చేయండని. లేకపోతే ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినట్టే అవుతుంది. భూమి హక్కు మానవ హక్కని సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఇలా చేయడం మానవ హక్కులకు భంగం కలిగినట్టే.
– దీనిపై ఒక హైపవర్ కమిటీ వేయాలనే రిక్వస్టు కూడా పిటిషన్లో పెట్టారు. హైకోర్టులో ఈ కేసు అడ్మిట్ చేసుకున్నారంటేనే దీన్ని రైతుల విజయంగా భావించొచ్చు. ప్రభుత్వం ఏడాదిగా దీనిపై ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ వస్తున్నది. ప్రపంచంలోనే ఇలాంటి చట్టం లేదు. వందశాతం కేసులు పరిష్కారమవతున్నాయని చెబుతున్నది. ఏడాది తర్వాత దీనిపై కేసు అడ్మిట్ అయ్యింది.
– ఇప్పటి వరకు ఎవరూ కోర్టు మెట్లక్కపోవడం ఆశ్చర్యమే. అందరూ మాట్లాడుతన్నారు తప్పితే.. హక్కులకు భంగం కలుగుతుందని ఎవరూ కోర్టు మెట్లెక్కలేదు.
– హియరింగ్‌లో … రాజ్యంగంలో ఉల్లంఘించిన అంశాలున్నాయా అని కోర్టు చూస్తది. భూమి ఉండి ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్న వారందరికీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే.
– ప్రభుత్వం దీన్ని సమర్థించుకోవడానికే మొగ్గు చూపుతుంది .అన్ని బాగున్నాయనే మెస్సేజ్ ఇప్పటికే ప్రజలకు ఇచ్చేసింది సర్కార్..
– కానీ ఈ ధరణి తప్పొప్పులు సరిచేసుకునే అవాకశం ప్రభుత్వానికి ఉంది. జమా బందీ చేయమని నెలలు కింద సర్క్యూలర్ ఇష్యూ చేసింది. మధ్యే మార్గంగా.. ఈ ప్రక్రియ ద్వారా ఊర్లలో తిరుగుతూ తప్పులను గుర్తించొచ్చు. క్షేత్రస్థాయిలో తిరిగి జమాబందీ పేరుతో ధరణి సమస్యలు పరిష్కరించొచ్చు. నిషేధిత జాబితాలో లోపాలు, ధరణిలో తప్పులుంటే తెలుస్తాయి.
– టైటిల్ గ్యారెంటీ చట్టం తెస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. 2016-17 వరకు బాగానే ఉన్నా.. తర్వాత సాధ్యం కాదన్నారు. చేతులెత్తేశారు.
– జనాలకు దీనిపై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది. ప్రభుత్వం కూడా తప్పుదిద్దుకునే అవకాశం ఉంది. కోర్టు్కు పోయింది కాబట్టి. కోర్టు ఆదేశాల మేరకు చేస్తాం అంటే సరిపోతుంది.
– ప్రభుత్వం దీన్ని పరువు సమస్యగా చూడొద్దు. నిరుద్యోగ సమస్య ఎంతగా ప్రభుత్వ వ్యతిరేకతను తెచ్చిపెట్టిందో.. ఈ ధరణి భూ సమస్యల పట్ల కూడా అంతే వ్యతిరేకత ఏర్పడుతున్నది.
– కొన్ని వర్గాలకు ఇదే అవసరం. ఎవరికో కొమ్ము కాసి కొందరికి బెనిఫిట్ చేయడం ప్రభత్వ ఉద్దేశ్యమా..? అనే అనుమానాలు వస్తన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు. ఎవరినైనా బెదిరించొచ్చు. కొన్ని సెక్షన్లకే ఇది మేలు చేస్తుంది. కొందరు కావాలనుకుంటే కొందరు అధికారుల వద్ద కీ ఓపెన్ చేసుకుని మార్చుకోవచ్చు.
– సీఎంకు ఇవన్నీ తెలియవా.? కొందరు మిస్‌గైడ్ చేశారా.? అదే చేస్తే ఇప్పటికైనా మార్చుకోవచ్చు. అందరికీ రైతు బంధు పోతే సమస్య లేనట్టు కాదు.. అసలు రైతు బంధే పెద్ద లోపభూయిష్టమైంది
– కేసీఆర్ ఇక్కడ ఏమేమైతే అమలు చేయాలనుకున్నాడో అవి అమలు జరగడం లేదు. పక్కరాష్ట్రం ఏపీలో మాత్రం అవే అమలు జరుగుతున్నాయి.
– అక్కడ సర్వే చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జట్‌తో రాబోయే మూడేండ్ల కాలంలో వ్యవసాయభూములు, ఇంటి స్థలాలకు సంబంధించిన పూర్తి రీ సర్వే జరుగుతున్నది. అక్కడ అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రపతికి పంపుకున్నారు. చట్టం వచ్చేసింది. జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్ పెట్టబోతున్నారు. అక్కడ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరి మాట వినే పరిస్థితి లేదు.
– 2016 వరకు ఇక్కడ కూడా మంచి ఆలోచనలే చేశారు. సాదా బైనామా చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన అని ఎప్పుడైతే మొదలు పెట్టారో పోటీలు పడి కలెక్టర్లు ఇంత శాతం పూర్తి.. అంత శాతం పూర్తి అని గొప్పలు చెప్పుకుని దీన్ని తప్పుల తడకలుగా మిగిల్చారు.
– కలెక్టర్ల మాట విని అంతా బాగుందనుకున్నది ప్రభుత్వం. టైటిల్ గ్యారెంటీ వద్దని ప్రభుత్వానికి సూచించారు. అది కేసీఆర్ విన్నాడు. అలాగే నడుచుకున్నాడు ఇది తెస్తే ప్రభుత్వానికి భారం అవుతుందని సీఎంను తప్పుదోవ పట్టించారు. వాస్తవంగా స్టేట్ బడ్జెట్లో దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు. కొత్త కౌలు చట్టాన్ని కూడా పట్టించుకోలేదు ప్రభుత్వం..