పండుగ బాగానే ఉంది పరిహారమేది?
వంద కోట్ల డోసుల సంబురం బాగానే ఉంది కానీ కోవిడ్-19 రెండో వేవ్ లో చనిపోయిన మృతుల కుటుంబాల లెక్క తేలక పోయే, ఇదేమి చిత్రమో సుప్రేం కోర్టు అదేశాలు కూడా లెక్కకు తీసుకోవడం లేదు. వంద కోట్ల డోసులు పంచినం అని ఇప్పుడు పండుగ చేసుకోవడం కాదు మూడో వేవ్ వస్తే ఎలాంటి ముందస్తూ చర్యలు తీసుకుంటున్నారు అనేది కదా దేశానికి కావాల్సింది.
మీరు ఇప్పుడు ఏం చేసిన రెండో వేవ్ లో జరిగిన నష్టాన్ని పూడ్చలేరు. ఇప్పుడు జయహో భారత్ భారతదేశం గొప్పది అని ఎంత పొగుడుకున్నా దేశం గొప్పదే కానీ పేద ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వలేని భారత్ గానే ప్రసిద్ధి కెక్కింది అనేది మర్చిపోవద్దు.
ఇప్పుడు కావాల్సింది పండగలు చేసుకోవడం కాదు నష్టపోయిన కుటుంబాలకు భరోసానివ్వడం వారికి ఆర్థిక పరమైన చేయూతనివ్వడం. అలాగే సుప్రేం కోర్టు ఆదేశాల ప్రకారం కోవిడ్-19 రెండో వేవ్ లో ఎంత మంది చనిపోయారు వారి వివరాలు విడుదల చేయాలి.
కుటుంబానికి యాభై వేల రూపాయలను వెంటనే చెల్లించాలి.
ఇదీ నిన్న మధుయాష్కీ తన ఫేస్‌బుక్ వాల్ పై పోస్ట్ చేసిన కామెంట్. బాగుంది. సందర్భానుసారం స్పందించాడు. ఇదేదో ఉత్సవంలా కేంద్రం సెలబ్రేట్ చేసుకుంటున్నది. ఆఖరికి రింగ్ టోన్ కాలర్‌గా కూడా దీన్ని పెట్టుకుని సంబరపడిపోయి.. తన భుజం తాను చరుచుకుని శభాష్ అని అనుకుంటున్నది. గత విపత్తును ఇంకా జనం మరిచిపోలేదు. అది చేసిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. కోలుకోలేని విధంగా కరోనా చేసిన గాయాలు మానలేదు. ఇప్పుడంతా సాధారణ జీవితాలు గడుపుతున్నారు కాబట్టి.. అంతా ప్రశాంతంగా ఉన్నారు… ఏమీ బాధలు లేవు.. అన్ని మరిచిపోయారు. ఉద్యోగాలు చేస్తూ హాయిగా ఉన్నారు.. అని కేంద్రం అనుకుంటే అలా అనుకోవడానికి ఎవరూ సిద్దంగా లేరు. కరోనా ముప్పు ఇంకా పొంచే ఉంది. గతంలో కేంద్ర, రాష్ట్రాలు చేసిన తప్పులకు జనం బలికావాల్సి వచ్చింది. ఇకనైనా ముందు చూపుతో వ్యవహరిస్తే నష్టం నివారించిన వారవుతారు. ప్రచారార్బాటలకే పరిమితమైతే చరిత్రహీనులుగా మిగులుతారు.