ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓవైసీ బ్రదర్స్ ఏం మాట్లాడినా.. ముస్లిం యువకులకు అవి వేదవాక్కులు. ఆచరించాల్సిన ఆదేశాస్త్రాలు. అంతగా అభిమానిస్తారు ఆ పార్టీనీ, ఆ నేతలనూ. మొన్నోచోట.. బుర్ఖా వేసుకున్న అమ్మాయి ఎవరో అబ్బాయితో బైక్ పై వెళ్లుందని తెలిసి కొందరు ముస్లిం యువకులు ఆ బండిని అటకాయించారు. వాడిని ఆపి ఎడాపెడా కొట్టారు. మా ముస్లిం అమ్మాయితో నీకేం పనిరా అంటూ చితకబదారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్నుద్దేశించే ఓవైసీ ఇగో ఇలాంటి మాటలన్నాడు.
ముస్లిం యువతి ఎవరితో పోతే మీకేంటీ… మీరు మాత్రం ఎంత మందితోనైనా తిరగొచ్చా..? అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఇదే ఆశ్చర్యం అందరికీ. వాళ్లను ఇ ష్టానుసారం బతకనీయండని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. మేరేమన్నా దుబాయ్ పోలీసులా..? అని కూడా ప్రశ్నించాడు. అక్కడ కూడా ఇలాంటి రూల్స్ లేవని తనే మళ్లీ చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది. అన్ని మాటలు మనోళ్లు బాగానే వింటారు గానీ .. ఓవైసీ సాబ్..! గీ మాటలైతే మనోళ్లకు అసలే రుచించవు.
మతం ముసుగులో , మత్తులో మనమే కదా ముంచి లేపుతున్నది. పాఠాలు నేర్పి.. ఉసిగొల్పుతున్నది. వైషమ్యాలు, వైరుధ్యాలు పెంచి పోషిస్తున్నది. ఇప్పుడీ కొత్త పలుకులు మీ నోటి వెంట విని కొంత ఆశ్చర్యపోయినా.. తమ పంథా మార్చుకుంటారని మీరే కాదు… ఎవరూ అనుకోరు సాబ్… మీరిలాంటి మాటలు కొన్ని కోట్ల సార్లు చెప్పినా.. సరే. ఎందుకో డౌట్…! అంతే..!!