బాలీవుడ్ బాద్‌షాకు సన్ స్ట్రోక్ తగిలింది. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా.. అన్నట్టు కొడుకు పెరిగి పెద్దగైతే గానీ ఆ పుత్రుడిని పలువురు కొనియాడిన తర్వాత గానీ తెలవదు.. ఆ పెంపకం ఎలా ఉందో. షారూఖ్‌కు తన పెంపకం ఎలాంటిదో తెలిసిపోయింది. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన తర్వాత ఒక్కసారిగా షారూఖ్ జీవితం కూడా తలకిందులైపోయే పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఆయన బాలీవుడ్ బాద్‌షానే. పదుల సంఖ్యలో యాడ్స్ చేస్తూ కోట్ల వ్యాపారానికి కీలకంగా ఉన్న యాక్టర్. యాడ్స్ వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలిగిపోయాడు. అది నిన్నటి వరకు. కానీ నేడు. కొడుకు డ్రగ్స్ కేసు ఒక్కటి బాద్ షా జీవితాన్ని అతలాకుతలం చేసేసేంది.
Byju’s, BigBasket, Hyundai, Frooti, D’decor, Fair and Handsome, FoodPanda, Reliance Jio, Dubai Tourism, Denver, Kent,Dish TV……… ఇవన్నీ షారూఖ్ చేస్తన్న యాడ్స్. ఇప్పుడు వీటన్నింటిపైనా ప్రభావం చూపుతున్నది కొడుకు డ్రగ్స్ కేసు. మొదటగా బైజూస్ తన యాడ్స్‌ను నిలిపివేసింది. షారూఖ్ నటించిన ఈ యాడ్ ఇక పై రాదన్నమాట. కానీ ఆ సంస్థ దీన్ని ప్రకటించడానికి ఇష్టపడటం లేదు. కానీ యాడ్స్ మాత్రం ఆగిపోయాయి. బిగ్ బాస్కెట్ సంస్థ కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నది. వరుసగా ఈ యాడ్స్ సంస్థలన్నీ షారూఖ్ నటించినవన్నింటినీ హోల్డ్‌లో పెట్టే బాటలోనే కొనసాగుతున్నాయి. ఇంగ్లీష్ ప్రతికల్లో వరుసగా వస్తున్న కథనాలతో ఇవి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. నిత్యం కొడుకుపై వార్తా కథనాలు రావడంతో షారూఖ్ పై ఇవి తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. నిత్యం కోట్లబిజినెస్ చేసి పెట్టే బాద్‌షా యాడ్స్ ఇప్పుడు తెరమరుగుకానున్నాయి. వెండి తెరపై వెలుగు వెలిగిన ఖాన్ సాబ్ ఇప్పుడు కొడుకు డ్రగ్స్ దెబ్బకు కుదేలై.. ఆర్థికంగా దెబ్బతిని, పరువు, ప్రతిష్ఠ కు భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి.