ఆయిల్ ధరలు..
లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన..
పై రెండింటిని బీజేపీ పాలకులు ఎంత తేలికగా తీసుకుంటున్నారో తెలియదు కానీ..
ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఉల్లి ధరలు పెరిగినందుకు ఒక ప్రభుత్వాన్నే ఓడించారు.
ఆ ఒక్క ఉదాహరణ చాలు ఆ పార్టీ మేల్కొనేందుకు.
——
ఆయిల్ ధరలు దిగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను తగ్గించుకోవాలి లేదా ఆయిల్ ను జీఎస్టీలో నైనా చేర్చాలి. ఇంతకు మించిన పరిష్కారం మరొకటిలేదు. జీఎస్టీలో చేర్చడంపై కేంద్రం అంగీకరిస్తూ, రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలి. వ్యవసాయ బిల్లులను మొదట్లో వ్యతిరేకించినట్లు నటించిన కేసీఆర్ ను తదుపరి దారికి తెచ్చుకున్నట్లుగానే ఆయిల్ ను జీఎస్టీలో చేర్చడానికీ దారిలోకి తెచ్చుకోవడం కష్టం కాదేమో. ఎలాగూ డజను రాష్ట్రాలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కేసీఆర్ వంటి సీఎంలను దారికి తేవడం సాధ్యం కానిదేమీకాదు.
———
నిజానికి వ్యవసాయ బిల్లులపై రాజకీయాల ప్రభావమే ఎక్కువ ఉంది. అయితే, జరుగుతున్న సంఘటనలు మాత్రం బీజేపీకి నష్టం కలిగించేవి కావడమే ఆ పార్టీ అందోలన చెందాల్సిన విషయం.
రైతు ఉద్యమకారులు మంత్రి ఇంటి ముట్టడికి వెల్లడం, మంత్రి కుమారుడి వాహనం డీకొట్టడం వంటి సంఘటనలు వార్తలు చెపుతున్నాయి. ఏదిఏమైనా ఒక మంత్రి కుమారుడి వాహన ఘటన కాబట్టి , ఆ సంఘటన అందరికీ దిఘ్బ్రాంతి కలిగించింది.
పాలకుల కుటుంబ సభ్యుల అహం వ్యవహారాలు అపుడపుడు శృతి మించుతుండడం చూస్తుంటాం. అవి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెడుతాయి. లఖీంపూర్ ఘటనలోనూ బీజేపీ అదే అపవాదును మూటకట్టుకోవచ్చు. సంఘటన జరిగిన వెంటనే మంత్రి కొడుకు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి ఉంటే యోగీ ఇంతటి అపవాదు మోసేవాడు కాదు. ఇప్పటికైనా ఆ మంత్రిని తొలగిస్తే మోడీ ప్రతిష్ట కు వచ్చిన భంగం తొలగిపోతుంది. ఆ
మంత్రి తొలగింపుతో బీజేపీకి జరిగే మేలేమిటంటే..
ఇకపై మంత్రుల బంధుగణం దురహంకార చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటది.
Kalluri Srinivas Reddy
