బిగ్‌బాస్‌లో అంతో ఇంతో పరిపక్వత కలిగిన కంటెస్టెంట్ ఉన్నాడంటే అతను యాంకర్ రవే. సమయం, సందర్భం బట్టి ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడా అత్యుత్సాహం కనబడటం లేదు. తన స్టైల్‌లో తాను జీవించేస్తున్నాడు. నటించడం లేదు. పోతూ పోతూ నటరాజ్ మాస్టర్ ఈ రవికి గుంటనక్క అని పేరు పెట్టి వెళ్లాడు. ఇదిప్పుడు వైరల్ అయ్యి కూర్చుంది. చాలా సోషల్ మీడియా సైట్‌లలో గుంటనక్క అంటనే రవి అనేలాగా అర్థం మార్చేశారు పాపం…! కానీ ఈ పెట్టిన పేరుకు సార్థకత లేకుండా చేస్తున్నాడు రవి. గుంటనక్క అని తిట్టినా లోలోపల బాధను అణిచిపెట్టుకున్నాడే తప్ప. మిగిలిన మగ కంటెస్టెంట్లలా బోరున ఏడవలేదు. హుందాగా ఉంటున్నారు. మెచ్యూరిటీతో ప్రవర్తిస్తున్నాడు.
ఒక్కోసారి ఈ షోకు ఎందుకు వచ్చాన్రా బాబు అనే రేంజ్‌లో పశ్చాత్తాప పడుతున్నట్లు కూడా కనబడుతున్నాడు. గుంటనక్క అని పేరు పడ్డ రవి తప్ప మిగిలినవారెవరూ పెద్దగా ఎవరినీ ఆకట్టుకోవడం లేదట. అసలు ఈ షోనో పరమ బోరింగ్‌గా ఉదంటున్నారు బిగ్‌బాస్ అభిమానులు. నాగ్ ఎంత దీన్ని పైకి లేపుదామన్నా.. దమ్ము సరిపోవడం లేదు. అలా రోజు రోజుకీ చతికిలబడుతుంది. ఏదో స్కిన్ షో.. అంగాంగ ప్రదర్శనల మీద ఆశలు పెట్టుకుని అలా నెట్టుకొస్తున్నారు. కానీ నట్టింట దీన్ని పిల్లలూ. పెద్దలు కలిసి చూసేస్తున్నారు. ఎవరు చూస్తే ఏం.. కావాల్సింది రేటింగే కదా కానిచ్చెయ్….