ఎప్ప‌టి కెయ్య‌ది ప్ర‌స్తుత‌
మ‌ప్ప‌టి కా మాట‌లాడి య‌న్యుల మ‌న‌ముల్‌
నొప్పింప‌క తా నొవ్వ‌క‌
త‌ప్పించుక తిరుగువాడె ధ‌న్యుడు సుమ‌తీ!

ప్ర‌స్తుతం ఇట్ల‌నే ఉంది స‌జ్జ‌నార్ ప‌రిస్థితి. దిశ నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తే హీరో అయ్యాడు. అంతా మెచ్చుకున్నారు. అది అప్పుడు . కానీ ఈ దిశ పేరుతో క‌మిష‌న్ విచార‌ణ అంటూ తిప్పితే చిర్రెత్తుకొస్త‌ది. అస‌లే ఇప్పుడు త‌ను ఆర్టీసీ ఎండీ. న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ను ఎలా గ‌ట్టెంక్కించాలో త‌న మార్కు ఎలా చూపెట్టాలో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఇలా విచార‌ణ క‌మిష‌న్ అంటూ లేనిపోని సూటిపోటి ప్ర‌శ్న‌ల‌డిగితే చిర్రెత్తుకు రాదా?

అందుకే ఇదంతా ఎందుకు అనుకున్న‌ట్టున్నాడో.. ఎలాగోలా ఈ కేసు పీడ విర‌గ‌డ చేసుకుంటే చాల‌నుకున్న‌ట్టున్నాడు. అస‌లు ఈ కేసుతో సంబంధమే లేద‌ని చెప్పేశాడు. ఆ కేసు ద‌ర్యాప్తు త‌న ప‌రిధి కాద‌న్నాడు. అయినా క‌మిష‌న్ వేసిన చిక్కు ప్ర‌శ్న‌ల‌కు ఎక్క‌డా చిర్రెత్త‌కుండా, చికాకు ప‌డ‌కుండా చిక్క‌కుండా ఓపిగ్గా డొంక‌తిరుగుడుగా స‌మాధాన‌మిచ్చాడు. అయినా క‌మిష‌న్ వ‌ద‌ల్లేదు. ఏంటీ మీరిలా బాధ్య‌త లేకుండా మాట్లాడ‌ట‌మేంటీ..? అని కూడా రెచ్చ‌గొట్టింది. చురక‌లంటించింది. అయినా మ‌న‌వాడు విన్లే. లేదు లేదు.. నాకు సంబంధం లేదు. అప్పుడ‌లా జ‌రిగింది. నా ప్ర‌మేయ‌మేమీ లేదు. వాళ్ల‌లా చెప్పారు. నేనిలా చేశాను. ఇలా ప్రెస్‌మీట పెట్టాను. అలా జ‌రిగింది. ఇలా ముగిసింది. అంతే.. అంతే.. అని అలా అలా చెప్పేశాడు.

ఒక ర‌కంగా క‌మిష‌న్‌ను కూడా త‌న మాట‌ల‌తో ఎన్‌కౌంట‌ర్ చేశాడు. అక్క‌డ క‌మిష‌న్ ముందు ఏం చెప్పినా.. స‌జ్జ‌నార్ సాబ్ మీరు మాకు హీరోనే. అప్ప‌టిక‌ప్పుడు మా ఆవేశాన్ని అర్థం చేసుకుని ఆ న‌లుగురిని కుక్క‌ల‌ను కాల్చి చంపినట్టు చంపేశారు. మొన్న ఆరేండ్ల చిన్నారిని రేప్ చేసి చంపిన ఆ రేపిస్టు రాజుగాడి ఉదంతంలో మిమ్మ‌ల్నే మేం త‌లుచుకున్నాం. మీరేమో ఆర్టీసిలోకి వెళ్లి న‌ష్టాలు పూడ్చేందుకు ఎన్కౌంట‌ర్ సంస్క‌ర‌ణ‌ల‌ను నాంది ప‌లికారు. రైలు ప‌ట్టాల ఎన్కౌంట‌ర్‌ల‌ను ఇప్పుడు ప్ర‌వేశ‌పెట్టాల్సి వ‌చ్చింది. అయినా ఈ రైలు ప‌ట్టాల ఎన్కౌంట‌ర్ కాన్సెప్ట్ ఏం బాగాలేదు సార్‌. మీ మార్కే బాగుంది.

You missed