బ‌తుక‌మ్మ కు
గౌరవనీయులైన తెలంగాణ హిందూ మహిళలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు విన్నపము:

బతుకమ్మ పండుగ వచ్చింది.ఇగ మీరు DJ పాటలు పెట్టి సినిమా డ్యాన్స్ చేయకండి. దయచేసి పండుగ సంస్కృతి, సంప్రదాయం & కాపాడండి.మీకు తెలియకపోతే, పెద్దల నుండి బతుకమ్మ ఆట నేర్చుకోండి. గ్రామాలలో పెద్ద ఆడవారలు మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నిజమైన సంస్కృతిని పాడు చేయవద్దు.పువ్వులుమీద కూర్చున్న పసుపు గౌరమ్మను ప్రార్థించే మార్గం.ఓ గొప్ప సంప్రదాయం.దయచేసి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.ఇది డ్యాన్స్ కాదు.

ఉద‌యం నుంచి వాట్సాప్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న మెసేజ్ ఇది. ప్ర‌తీసారి బ‌తుక‌మ్మ పండుగ‌కు ముందు ఇలాంటి మెసేజ్‌లు ఇస్తూనే ఉంటారు. కానీ వీటి ప్ర‌భావ‌మేమీ పెద్ద‌గా క‌నిపించ‌దు. ఏటేటా ఇలాంటి సంస్కృతి పెరుగుతుందే కానీ త‌గ్గ‌డం లేదు. ఒక‌ప్పుడు బ‌తుక‌మ్మ ఆడేందుకు మ‌హిళ‌లు అంద‌రూ ముందుకు రాక‌పోయేవారు. తెలంగాణ ఉద్య‌మం, ఆ త‌ర్వాత బ‌తుక‌మ్మ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా పండుగ‌లా చేసుకుంటున్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కానీ పాట‌లు పాడ‌ట‌మే స‌మ‌స్య‌. కొంద‌రేమో మంచి మ్యూజిక్‌లో కూడా బ‌తుక‌మ్మ పాట‌ల‌నే పెట్టుకుని బ‌తుక‌మ్మ ఆడుతారు. ఇంత వ‌ర‌కైతే ఓకే. కానీ డీజే సాంగులు, బ‌తుక‌మ్మ‌తో సంబంధంలోని పాట‌ల‌తో ఆట‌లాడుతూ దాండియా స్టెప్పులేస్తూ.. ఏదో అలా ఆడామ‌నిపిస్తారు. తంతులా ముగించేస్తున్నారు. ఇదే ట్రెండ్ న‌డుస్తుంది.

దీంతో పాటు… మ‌గ‌వారు కూడా బ‌తుక‌మ్మ ఆడేందుకు, ఫోటోల‌కు ఫోజులిచ్చేందుకు పోటీలు ప‌డుతుంటారు.బ‌తుక‌మ్మ నిండైన ఆడ‌వారి పండుగ‌. వారి ఆట‌లో కూడా ఈ మ‌గ‌వాళ్లు జోక్యం చేసుకుని మేము సైతం అన‌డం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు మామూలుగా మారింది. ఈ సంస్కృతి ఏడాదికేడాది ఇంకింత పెరుగుతుందే త‌ప్ప త‌గ్గేలా లేదు.

 

You missed