సోనూసూద్.. సినిమాల్లో విలన్. నిజ జీవితంలో హీరో. ఆయనొక ప్రత్యేక క్యారెక్టర్. విభిన్న మనస్తత్వం. ఈ వ్యక్తిత్వమే ఆయనను ఓ ప్రత్యేక స్థానంలో నిలిపింది. ప్రాంతం, కులం, మతం బేధం లేకుండా.. ఎవరికి ఎక్కడ ఏ సహాయం వచ్చినా స్పందించి తనకు తోచిన సాయం చేస్తున్నాడు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సందర్భంలో సోనూసూద్ చేసిన ప్రజాసేవ ఏ నాయకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే రాజకీయ నాయకులకు ఆయన పై కన్ను కుట్టింది. కక్ష పెంచింది. సమయం కోసం చూసి ఇటీవల ఐటీ దాడుల పేరుతో తొక్కేయాలని చూశారు. కానీ గోడకు కొట్టిన బంతిలా మరింత స్పీడ్‌లా దూసుకు వస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఛాలెంజ్ విసురుతున్నాడు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఏటికి ఎదురీదేందుకు సిద్ధమై నిరూపిస్తున్నాడు.