ఆంధ్ర‌లో సినీ ఇండ‌స్ట్రీ లొల్లి అది. మ‌న‌కు ఏ మాత్రం సంబంధం లేదు. జ‌గ‌న్‌కు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ధ్య రాజ‌కీయ గొడ‌వ‌. సినీ ఇండ‌స్ట్రీ పై ప‌డింది. జ‌గ‌న్ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అంటున్నాడు.. ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. అదంతా వాళ్ల లొల్లి. మొన్న పీకే .. మ‌రీ కెలికి..కెలికి వ‌దిలాడు జ‌గ‌న్‌ను .ఇది ముదిరి మ‌రింత పాకాన ప‌డింది.

పోసాని కృష్ణ ముర‌ళి లేచాడు. ఏదో అన్నాడు. ఇవాళ హైద‌రాబాద్ పీకే వీరాభిమానులు వెర్రెత్తిపోయి పోసానిపై దాడి చేశారు. ఎక్క‌డి పెంట కంపు… ఇక్క‌డెందుకు రా పూస్తున్నారురా..అని నెటిజ‌నులు దుమ్మెత్తి పోస్తున్నారు. వెర్రిత‌ల‌లు వేసిన వీరాభిమానులు .. బ‌స్తీమే స‌వాల్ అంటూ బూతులు తిడుతూ తొడ‌లు చ‌రుచుకుంటున్నారు. పోసాని పీకేపై ఇక్క‌డే ఫిర్యాదు చేస్తాడ‌ట‌. ఇక్క‌డే త‌న‌కు న్యాయం జ‌రుగుంద‌ని కూడా అనేశాడు. మీ ఆంధ్రలొల్లి.. ఇక్క‌డికి తీసుకొచ్చి .. చింపి చాటంత చేయండి.

You missed