రెడ్డి స‌మాజం పేరిట రెండ్రోజులుగా వాట్సాప్ గ్రూపుల‌లో ఓ మెసేజ్ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. చాక‌లి ఐల‌మ్మ‌ను గుర్తిస్తున్నారు బాగానే ఉంది. కానీ సాయుధ పోరులో రెడ్ల చ‌రిత్ర‌ను చెరిపేసే ప్ర‌య‌త్న‌మా ఇది అని కొత్త వివాదాన్ని తెర‌పైకి తెచ్చారు. మ‌రి ఆరుట్ల క‌మ‌లాదేవీని ఎందుకు విస్మ‌రిస్తున్నారు.. అంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఐల‌మ్మ పోరాటం స్వార్థం అని, ఆరుట్ల క‌మ‌లాదేవీ పోరాటం త్యాగ‌మ‌ని అభివ‌ర్ణిస్తున్నారు. ఇంకా ఏమేమో త‌మ ఆవేద‌న‌ను వెలిబుచ్చారు ఈ రెడ్డి స‌మాజ బాంధ‌వులు. ఇదిప్పుడు వైర‌ల్‌గా మారింది. చ‌ర్చ‌కు దారి దారి తీసింది. కొత్త వివాదానికి తెర లేపింది. ఆ వాట్సాప్ మెసేజ్ ఇదీ…

……………………………………………………………………………….

సాయుధ పోరులో రెడ్ల చరిత్రని చేరిపేసే ప్రయత్నమా ….?

చాకలి ఐలమ్మ సరే ,మరి ఆరుట్ల కమలా దేవి మాటేమిటీ?

తెలంగాణ ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి ముందుండి నడిపించిన రావి నారాయణరెడ్డి,భీంరెడ్డి నర్సిహ్మారెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ఆరుట్ల రాం చంద్రారెడ్డి లను విస్మరించి గ్రామస్థాయిలో పని చేసిన చాకలిఐలమ్మకు మొన్న వర్ధంతి ,నిన్న జయంతి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపడం అంటే రెడ్ల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నమే కాకుండా రెడ్ల చరిత్ర ని కించపరచడమే,ఒకవేళ ఐలమ్మ మహిళ కావడం వల్ల ఈ ప్రత్యేక గుర్తింపు అనుకుంటే మంచిదే కానీ ఆరుట్ల కమలాదేవిని ఎందుకు విస్మరిస్తున్నట్టు? తెలంగాణ సాయుధ పోరులో రెడ్ల నాయకత్వాన్ని, చరిత్ర ని కనుమరుగు చేసే ప్రయత్నం కాకపోతే మరేమిటి?

ఐలమ్మ పోరాటం స్వార్ధం… ఆరుట్ల కమలాదేవి పోరాటం త్యాగం. ఐలమ్మ తన కోసం,తన భూమి కోసం పోరాటం చేస్తేనే వీరనారి అయితే? ఉన్నతంగా బతికే ఆస్తులు,అంతస్తులు, అవకాశం ఉన్నా వాటన్నింటినీ త్యాగం చేసి నిజాం నుండి తెలంగాణ ప్రజల విముక్తి కోసం దీర్ధకాలిక పోరాటం చేసిన కమలాదేవి ఏం అవుతుందో మీరే చెప్పాలి?

ఆరుట్ల కమలాదేవి పోరాటం ముగిసిన తర్వాత శాసనసభ్యురాలుగా కూడా ఉన్నారు కదా? ఎందుకు వీరి జయంతి ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపడం లేదు? మా ప్రశ్నకు సమాధానం కావాల్సిందే?

ఇట్లు.
రెడ్డి సమాజం…

You missed