స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన త‌ర్వాత తొలిసారిగా మండ‌లిలో క‌విత ప్ర‌సంగం ఆక‌ట్టుకున్న‌ది. స‌మ‌స్య‌లను ఏక‌రువు పెట్టి ప‌రిష్క‌రించాల‌ని కోర‌డం బాగుంది. ప్ర‌భుత్వం ఇంకా చేయాల్సిన వాటిని గుర్తు చేయ‌డం సంద‌ర్బోచితంగా తోచింది. నిధులు త‌ర్వాత ముందు క‌నీస అవ‌స‌రాలేవీ? అంటూ ఆమె ప‌రోక్షంగా సంబంధిత శాఖ మంత్రిని నిల‌దీసిన‌ట్లు మాట్లాడ‌టం \స‌ముచితంగా అనిపించింది. కుర్చోవ‌డానికి కుర్చీలు కూడా ఎంపీటీసీల‌కు లేవ‌నే విష‌యాన్ని స‌భాముఖంగా ఎండ‌గ‌ట్ట‌డం క‌విత ప్ర‌సంగానికి ప్రత్యేక‌త‌ను తీసుకొచ్చింది. తొలి ప్ర‌సంగమే స‌మ‌స్య‌ల తోర‌ణం క‌ట్టిన క్ర‌మం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.

You missed