స‌న్న‌పురెడ్డి వెంక‌ట రామిరెడ్డి రాసిన న‌వ‌ల కొండ‌పొలం. గొల్ల‌ల జీవితాల‌ను అద్దంప‌ట్టే స్టోరీ. ఈ న‌వల అధారంగానే క్రిష్ జాగ‌ర్ల‌ముడి డైరెక్ష‌న్‌లోసినిమా వ‌స్తున్న‌ది. ట్ర‌యిల‌ర్ విడుద‌లైంది. వ‌చ్చే నెల 8న సినిమా విడుద‌ల కానుంది. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేస్తున్నారు. గొర్ల‌కాప‌రుల జీవిన చిత్రాల‌కు అద్దం ప‌ట్టే సినిమా. న‌వ‌ల పేరునే సినిమాకు పెట్టారు. క‌డ‌ప జిల్లాలో అక్క‌డి నేటివిటీ , గొర్రెల కాప‌రుల జీవితాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసి రాసిన న‌వ‌ల ఇది.

డాక్ట‌ర్ కేశ‌వ‌రెడ్డి రాసిన అత‌డు అడ‌విని జ‌యించాడు.. న‌వ‌ల కూడా పందుల పెంచే ముస‌లోడి పాత్ర‌తో ఉంటుంది. అంతా అడ‌వి నేప‌థ్యం. పందుల‌ను మేపేందుకు వెళ్లిన పిల్ల‌వాడు, పందులు రాకపోవ‌డంతో ముస‌లోడు వారిని వెతుక్కుంటూ అడ‌విలోకి పోయి.. అక్క‌డ ప‌రిస్థితుల‌ను ఎదుర్కునే క‌థ‌నంతో సాగే ఈ న‌వ‌లా ఆసాంతం చ‌ద‌విస్తుంది. క‌ట్టిప‌డేస్తుంది. కొండ‌పొలం కూడా ఇదే పంథాలో ఉంటుంది. కొండ‌పొలంలో గొర్ల‌కాప‌రుల జీవితాలు, బాధ‌లు, క‌ష్టాలు .. అన్ని మిళిత‌మై ఉంటాయి. అత‌డు అడ‌విని జ‌యించాడు…లో మొత్తం అడ‌వి, అడ‌విలో త‌న పందులను ర‌క్షించుకునేందుకు జంతువుల‌తో, ప్ర‌కృతితో చేసిన పోరాటం క‌నిపిస్తుంది. ఈ న‌వ‌ల హావీవుడ్‌లో సినిమా తీసేందుకు ఎంపిక చేసుకున్నారు.

కేశ‌వ‌రెడ్డే రాసిన మునెమ్మ న‌వ‌ల హ‌క్కుల‌ను కూడా త‌నికెళ్ల భ‌రిణి కొనుక్కున్నాడు. కానీ ఇంకా సినిమా తీయ‌లేదు. రాయ‌ల‌సీమ మాండ‌లికంలో రాయ‌డం కేశ‌వ‌రెడ్డి స్టైల్‌, అత‌ని ర‌చ‌నా శైలి క‌ళ్ల‌ముందు క‌ద‌లాడే సినిమా సీన్ల‌లాగే ఉంటాయి. జ‌ర్న‌లిస్టు, ర‌చ‌యిత బీరెడ్డి న‌గేష్ రెడ్డి రాసిన ఓ న‌జియా కోసం .. న‌వ‌ల ఆధారంగా సుకుమార్ సినిమా తీయ‌బోతున్నాడు.

 

You missed