ఈ రాంబాబు మళ్లీ మీడియాపై పంచులేశాడు. విరుచుపడ్డాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు అనే ఓ చెత్త సినిమా తీశాడు గుర్తింది కదా. కథా తోకా లేకుండా.. పిచ్చోడి చేతిలో రాయిలా.. ఏదో చెప్పేందుకు నీతులన్నీ మూటగట్టి డైలాగులతో చిర్రెత్తించాడు. ఇందులో మీడియాతో ఓ ఆటాడుకున్నాడు. ఓ రిపోర్టర్ వేషం వేసి ఏవేవో తిక్క తిక్క ప్రశ్నలడగుతూ ఉంటాడు. బెడిసికొట్టింది. పాపం పూరీ కూడా ఏం చేయలేకపోయాడు. అంతా రాంబాబు తిక్క డైరెక్షన్ పైత్యం మరీ. మళ్లీ అదే పైత్యం ఇలా మీడియా మీద చూపించాడు. సాయి ధరమ్ తేజ్‌ను సపోర్టు చేసేందుకు పాపం మీడియా వక్రమార్గాన్ని ఎత్తిచూపేందుకు నానా తంటాలు పడ్డాడు. వేగంతో బైక్ నడిపిన విషయం ఓకే అని ఒప్పుకుంటూనే .. వాడి ఖర్మ అని తిడుతూనే.. మీరంతా ఎందుకు వాడి వెంటపడ్డారని ఆవేదన వెలిబుచ్చుతూనే.. మీరు చేయాల్సిన కర్తవ్యమిదీ అని కర్తవ్యబోధ చేసేందుకు మళ్లీ క్లాసు అందుకున్నాడు. యథావిధిగా అభిమానులు ఈలలే వేశారు. అర్థం కాకున్నా…