అది రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రకటన. బోరున వర్షం కురస్తుంటే ట్రాఫిక్ అంతా నిలిచిపోతుంది. ఓ కారు విండోను కొడుతుంది ఓ ట్రాన్స్ జెండర్. అందులో ఉన్న పెద్దావిడ విసుక్కుంటూ.. వీళ్లకు పనిలేదు.. అంటూ పర్సులో నుంచి పైసలు తీసి ఇవ్వబోతుంది. అయ్యయ్యో.. వద్దమ్మా.. ఈ రోజు వర్షం పడుతుంది. పక్కనే మా టీకొట్టు ఉంది. అందరికీ ఓ టీ ఇద్దామనుకున్నా.. అని టీ గ్లాస్ అందిస్తుంది. పెద్దావిడకు, అందులో ఓ పాపకు. ఆమె ఆశ్చర్యపోతుంది ఆ ట్రాన్స్ జెండర్ మానవత్వానికి. ఉదారతకు. సంతృప్తిగా టీ తాగి.. ఇలా రా అమ్మా అని పిలుస్తుంది. దగ్గరికి వస్తుంది ఆ ట్రాన్స్ జెండర్. ఏదో ఇవ్వబోతుందనుకుని మళ్లీ అయ్యయ్యో వద్దమ్మా.. అందరికీ ఈరోజు ఉచితంగా చాయ్ ఇస్తున్నా అని చెప్పబోతుంది. నేను నీకు డబ్బులు ఇవ్వడాని కి రమ్మనలేదు.. అని సుఖీభవ అని తలపై చేతులు పెట్టి దీవిస్తుంది.
ఇదీ యాడ్. గుండెకు హత్తుకునేలా దీన్ని తీసి తన రెడ్లేబుల్కు విస్తృత ప్రచారం చేసుకున్నాడు కంపెనీ వాడు. మంచి క్రియేటివిటీ. కానీ ఇదిప్పుడు ట్రోల్ చేసుకోవడానికి మారింది. కామెడీకి వాడుకుంటున్నారు. పొలిటికల్ పంచులు వేసుకునేందుకు దీన్ని విరివిగా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. బరాత్లతో తీన్మార్ స్టెప్పులకూ వాడేస్తున్నారు. ఇప్పడిది ట్రెండింగ్ వర్డ్… అయ్యయ్యో వద్దమ్మా…….
https://www.youtube.com/watch?v=1XXiJUraaZ8
