జ‌గిత్యాల టౌన్‌. పేరు జై ప్ర‌కాశ్‌. చిన్న వ‌య‌స్సు. దాదాపు ప‌న్నెండేళ్లు ఉంటాయి కావొచ్చు. చ‌దివేది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో. పేప‌ర్ వేస్తున్నాడు రోజు. క‌ష్టఫ‌లి అనే నినాదాన్ని చిన్న‌ప్ప‌ట్నుంచి న‌మ్ముకున్నాడు. ప‌నిచేసుకుంటున్నాడు. ఈ రోజు ఒక‌రు అత‌న్ని ఆపి చిన్న ఇంట‌ర్య్వూ తీసుకున్నాడు. చ‌ద‌వుకునే వ‌య‌స్సులో ప‌నిచేస్తే త‌ప్పేంది? అని ఉల్టా అత‌న్నే అడిగాడు. అత‌ని ఆత్మ‌విశ్వాసం స్థాయి చూసి అంద‌రూ అబ్బుర‌ప‌డ్డారు. కేటీఆర్‌తో స‌హ‌. సుధీర్ కుమార్ తాండ్ర త‌న ఫేస్ బుక్ వాల్ పై దీన్ని ఈ రోజు పోస్ట్ చేశాడు. ఇది వైర‌ల్‌గా మారింది. కేటీఆర్ వ‌ర‌కూ చేరింది. కేటీఆర్ అబ్బుర‌ప‌డ్డాడు.శ‌భాష్‌రా చిన్నా..! అని త‌న ట్విట్ట‌ర్లో ప్ర‌శంసించాడు. ఆ వీడియోను షేర్ చేశాడు.

You missed