ఎవరీ వినయ్‌రెడ్డీ? ఎందుకలా తిట్టుకుంటున్నారు? అసలు కథేంటీ? ఒక్కసారిగా ఈ వినయ్‌రెడ్డి తెరపైకి ఎందుకొచ్చాడు? ఇది చదవండి తెలుస్తుంది.
ఇప్పుడు బీజేపీ శ్రేణులంతా ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డిని బండబూతులు తిట్టుకుంటున్నారంటా. అంత పెద్ద తప్పేం చేశాడు? లక్షలు గుమ్మరించి పత్రికలకు నిన్న నిర్మల్ సభ కోసం యాడ్స్ ఇచ్చాడు. ఇస్తే? ఇక్కడే తప్పులో కాలేశాడు ఈ సారు. గోండు ఆదివాసీలకు సంబంధించిన ఈ బహిరంగ సభకు అమిత్ షాను పిలిచి అంగరంగ వైభవంగా సభను ఏర్పాటుచేసి అందుకు ఏ మాత్రం తక్కువ కాకుండా లక్షలు గుమ్మరించి యాడ్స్ ఇచ్చి.. అందులో ఆదిలాబాద్ సోయం బాబురావు ఫొటోను మరిచాడు వినయ్‌రెడ్డి. అవగాహన లేకనో..
అసలు ఐడియానే లేదో తెలియదు కానీ సభకు సంబంధం లేని అర్వింద్ బొమ్మని పెద్దగా వేశాడుతప్ప చిన్న స్టాంపు సైజులో కూడా సోయం బాపురావు ఫొటో లేదు. ఇదిగో పట్టాడు మన రేవంత్ రెడ్డి. చాలా మంది దీన్ని చూశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రెస్‌మీట్‌కెక్కి బీజేపీ గాలి తీసి ఆటాడుకున్నాడు. ఆదివాసీల పై మీకెలాంటి ప్రేముందో దీన్ని బట్టి అర్ధమవుతుందని ఒక్క మాటలో సభ ఉద్దేశాన్ని నీరుగార్చి కోట్లు ఖర్చు చేసిన సభ బుడిదలో పోసిన పన్నీరు మాదిరిగా చేసి వదిలేశాడు. దీనికంతటికీ కారణమేవరూ? మన వినయ్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ ఈయన. ఒకసారి ఓడిపోయాడు.. ఇంకొసారి టికెట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్వింద్‌ను బుట్టలో వేసుకునేందుకు, అమిత్ షా నజర్‌లో పడేందుకు పాపం లక్షలు గుమ్మరించాడు యాడ్స్ కోసం. ఫలితం దక్కడం మాటటుంచి.. పచ్చి బూతులు పడుతున్నాడు బీజేపీ వాళ్లతో. వినయ్‌రెడ్డిని తిట్టడం కాదు సార్లు.. మీకు అవగాహన లేదా? ఈ యాడ్ పబ్లిష్‌కు ముందు మీరు చూడలేదా? లేక వినయ్‌రెడ్డి అత్యుత్సాహంతో, తన అవగాహనలేమితో డబ్బులు గుమ్మరించడం మీదున్న శ్రద్ధ.. ప్రొటోకాల్ ప్రకారం ఎవరెవరి ఫొటోలు ఉంచాలని దానిపై లేకపోవడంతో ఇదంతా జరిగింది. కొండనాలికకు మందేసుకుంటే వినయ్‌రెడ్డి ఉన్న నాలికే ఊడింది.