గజ్వేల్ సభవేదిక మీద రేవంత్‌రెడ్డి గర్జించాడు. సభ సక్సెసయ్యింది. రేవంత్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడే ప్రయత్నం చేశారు. పంచ్‌లు, ప్రాసలు బాగా క్లిక్కయ్యాయి. స్పీచ్ పర్వాలేదు. కానీ… ప్రసంగంలో అక్కడక్కడా తన అపరిపక్వత కనిపించింది. అజ్ఞానం తొంగి చూసింది. రెచ్చగొట్టే దోరణిలోనో… రేషం రావాలనో.. తెలియదు కానీ ప్రజలను చిన్నచూపు చూసినట్లుగా, వెర్రివాళ్లుగా తలిచినట్టుగా మాట్లాడాడు.
రెండు సార్లు కేసీఆర్ సీఎం చేశారు.. అంటూ ప్రజలు తప్పు చేశారన్న దోరణిలో మాట్లాడాడు. ప్రజాతీర్పునే తప్పుబట్టడం అంత మూర్ఖత్వం మరోటి ఉండదు. తెలిసిన నాయకుడు, తెలివైన నాయకుడెవడూ ప్రజా తీర్పును తప్పుబట్టడు. దీన్నిఇంకోలా చెప్పాల్సింది. ఇది వదిలేస్తే.. మరో మాటన్నాడు. మాకే నష్టం లేదు.. ఆస్తులున్నాయి… అంతస్తులున్నాయి.. వీదేశాలకు వెళ్తాం.. అక్కడే ఉంటాం…. ఇలా సాగింది. మీరు చేస్తున్నదంతా ప్రజల కోసమేనా? మీ పదవులు.. అధికారం కోసం కాదా? ఎందుకా వెర్రి మాటలు రేవంత్. ప్రజలేమన్న పిచ్చోళ్లనుకున్నావా? సేమ్, నీలాగే కేసీఆర్ కూడా మధ్యంతర ఎన్నికల సమయంలో మాట్లాడినట్టున్నాడు. నాకేం బాధలేదు.. మీకోసమే .. అన్నట్టుగా. ఎందుకిలాంటి ఆత్మవంచన మాటలు మాట్లాడతారో తెలియదు.
ఎందుకు ప్రజలను అంత తక్కువగా అంచనా వేసుకుంటారో తెలియదు. అధికారం లేకపోతే మీకు ఉనికి లేదు. నిద్రపట్టదు. అది వదిలేసి ఏదో ప్రజల కోసం మెహర్బానీ చేస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు రేవంత్. అబ్బే .. ఇది వర్కవుట్ కాదబ్బా..! ఇంకా నువ్వు నేర్చుకోవాలి. ఇక, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రియంబర్స్‌మెంట్, మిర్చి రైతు ఆవేదన, చైత్ర అత్యాచార, హత్య ఘటన…..పోలీసుల వైఫల్యం, సబ్జెక్టు వైజ్‌గా మాట్లాడాడు. స్పీచ్‌లో స్పష్టత ఉంది. జనానికి దగ్గరగా చేరే ప్రసంగం. పర్వాలేదు.