ఇవ్వాళ్ళ న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రికలో వచ్చిన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వార్త: తెలంగాణ భారత దేశ జీడీపీ కి అతి ఎక్కువగా దోహదం చేసే రాష్ట్రాల్లో నాలుగోదని. చానా సంతోషం అనిపించింది… గర్వమనిపించింది కూడా. అయితే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రచురించిన డేటాని కొంచం లోతుగా పరిశీలిస్తే ఎన్నో మంచి అంశాలు బైటికి కనపడుతాయి. దీన్ని విశదీకరించే చిన్న ప్రయత్నం ఇది:

NET STATE VALUE ADDED అనేది రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి /GSDP కి ఒక కొలమానం. రాష్ట్ర GSDPకి మనం ఇచ్చే సబ్సిడీలు కలిపి అందులోనించి ఇండైరెక్ట్ టాక్సెస్ (GST) మైనస్ చేస్తే వచ్చేదే NET STATE VALUE ADDED (NSVA).

కొన్ని కంక్లూషన్స్ :

1. గత నాలుగు సంవత్సరాలలో తెలంగాణ NSVA/GSDP 50% పెరిగింది అంటే సగటున ప్రతి సంవత్సరం 10.7% పెరిగిందన్న మాట. ఇది ఆషామాషీ ముచ్చట కాదు ఎందుకంటే గత 18 నెలలుగా ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారి తో అల్లకల్లోలం అవుతున్న తరుణంలో కూడా మనం ఈ పెరుగుదల చూస్తున్నాం.

ఈ పెరుగుదల ఏ సెక్టర్ల నుండి వచ్చిదంటే:

1. వ్యవసాయము దాని అనుబంధ రంగాలు. ఈ నాలుగు సంవత్సరాలలో ఈ సెక్టార్ సగటున 20.65% పెరుగుదలతోబాటుగా మొత్తం రాష్ట్రపు NSVA/GSDPలో 21.77% చేరుకుంది… అయితే మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏందంటే, వ్యవసాయము దాని అనుబంధ వృత్తులు తెలంగాణ ప్రజలకు అతి ఎక్కువ ఉపాధి ఇచ్చే రంగాలు .. ఈ పెరుగుదలను ఇంకో విధంగా చూడవలసిన కోణం: ఉపాధి అద్భుతంగా ఇచ్చిన రంగమని … 3 కోట్ల టన్నుల వడ్ల ఉత్పత్తి, దేశం లో పత్తి ఉత్పత్తి లో No.1 దీనికి తార్కాణాలు.

మాక్రో ఎకనామిక్స్లో ఉద్యోగావకాశాల్లో ఫుల్ ఎంప్లాయిమెంట్, అండర్ఎంప్లాయ్మెంట్, ఆన్ఎంప్లాయిమెంట్ అని మూడు స్థితులుంటాయి… డైరెక్ట్ డేటా లేదు కాబట్టి నేను అనుకోవడం ఏమంటే ఈ రంగంలో ఉపాధి అన్న పెరిగుండాలె, లేకుంటే అండర్ఎంప్లాయ్మెంట్ అన్నా గణనీయంగా తగ్గివుండాలె (లేకుంటే కూలి ధరలు పెరగడం కానీ, బీహార్, బెంగాల్ లేబర్ తెలంగాణకు వచ్చి పని వెతుక్కోవడం జరగదు). అయితే ఇది మొత్తం కూడా ఈ సెక్టర్లో ప్రభుత్వపు పనితనానికి ఒక నిదర్శనం: రైతు బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రోజెక్టుల మీద పెద్దెత్తున పెట్టుబడులు, నీటి లబ్ది, సివిల్ సప్లైస్ వ్యవస్థను పటిష్ట పరచడం లాంటి ప్రభుత్వపు చర్యలవల్ల సాధ్యమయ్యింది… COVID సమయం లో దేశానికి గణనీయంగా ధాన్యం కావలసి వచ్చింది… అందుకు అనుగుణంగా పంజాబుతో బాటు తెలంగాణ దేశానికి ఆ ధాన్యాన్ని అందించింది).

2. మైనింగ్ & క్వారీయింగ్ సగటున 12.51% పెరగడం అంటే మన కొంగు బంగారం సింగరేణి అద్భుతమైన ఫలితాలిస్తున్నదన్నట్టు. దీనితో బాటుగా మన ఇసుక పాలసీ కూడా పనిచేస్తున్నదన్నట్టే…

3. అయితే అన్నిటికన్నా అద్భుతంగా ఫలితాలిచ్చిన సెక్టార్ పవర్ సెక్టార్… గత నాలుగేళ్లలో సగటున 24% పెరిగింది… బోర్లకైనా, ఇరిగేషన్ ప్రోజెక్టులకైనా, గృహావసరాలకైనా, మ్యానుఫ్యాక్చరింగ్ & సర్వీసెస్ రంగానికైనా వెన్నెముక విద్యుత్తు కాబట్టి … కావలిసిన డిమాండ్ కు తగ్గట్టుగా రాష్ట్రం సప్లై చెయ్యగలుగుతున్నది కాబట్టే ఈ రంగం ఇంత వేగంగా పెరుగగలిగింది.

Real Estate, Ownership of Dwelling and Professional Services ఇందులో సాఫ్ట్వేర్ రంగం + రియల్ ఎస్టేట్ సింహ భాగం. దాదాపుగా 9% తో మంచి పెరుగుదల కనిపిస్తున్నది. నా అంచనా ఏమిటంటే తెలంగాణాలో సాఫ్ట్వేర్ కంటే కూడా రియల్ ఎస్టేట్ రంగం అధికంగా పెరుగుతున్నదని…. రియల్ ఎస్టేట్ రంగం ఏ ఆర్ధిక వ్యవస్థకైనా ఒక లీడ్ ఇండికేటర్… మొదలు ఆఫీస్ స్పేస్ ఏర్పరుచుకొని తరువాత అందులో జనాలను నింపుతారు… ముందు ముందు మనం అదే చూడబోతున్నాం కూడా….

తెలంగాణ ఆరేండ్ల చిన్ని, కొత్త రాష్ట్రం… మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలతో సరితూగి నిలబడుతున్నదంటే రాష్ట్రాన్ని నడుపుతున్న, నడిపిస్తున్న ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి…. అన్నిటి కంటే గొప్ప విష్యం ఏందంటే తెలంగాణ తలసరి ఆదాయంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబడడం… దాని అర్థం ఏందంటే తెలంగాణ రాష్ట్రం ఎకనామికాలీ ప్రొడ్యూక్టీవ్ రాష్ట్రం అని అర్థం… అంటే ఇక్కడివారు పనిమంతులని అర్థం.

Last Comments:

1. నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ .. జై కెసిఆర్ అని అనలే…. కానీ ఇవ్వాళ్ళ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా డేటాని చూసిన తరువాత జై కెసిఆర్ అని సంతోషంగా అంటా…. It is a great achievement to put the state’s economic standing on a firm footing.

2. అయితే నాకు కెసిఆర్ మీద ఒక సీరియస్ కంప్లైంట్ కూడా ఉన్నది : అది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీద కావలసినంత దృష్టి పెట్టకపోవడము.. అయితే గత ఆరు నెలలుగా మెడికల్ కాలేజెస్ కానీ, హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో హాస్పిటల్స్ మీద వస్తున్న వార్తలు నాలో ఆశను నింపుతున్నాయి.

– Vishweshwer Mangalapalli

You missed