సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి అత్యాచార, హత్య నిందితుడు రాజు అనుకున్నట్లుగానే శవమై తేలాడు. అందరూ ఊహించిందే జరిగింది. నెటిజన్లు కోరుకున్నదే జరిగింది. కానీ ఎన్కౌంటర్ రూపంలో కాదు. రైల్వే ట్రాక్ పై రాజు శవమై తేలినట్లు గుర్తించారు. అయితే రాజు పోలీసుల అదుపులో ఉన్నాడని.. కొన్ని గంటల్లోనే ఎన్ కౌంటర్ అయ్యి శవమై తేలుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి.

కానీ అనుహ్యూంగా చాలా సస్పెన్స్ తర్వాత స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తమ చేతికి మట్టి అంటకుండా ఓ ప్లానింగ్ ప్రకారం ఇదంతా చేశారనే భావిస్తున్నారు. మొన్న కేటీఆర్ ఈ ఉదంతం పై స్పందిస్తూ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, సత్వరం న్యాయం జరిగేలా హోం మినిస్టర్‌ను కోరుతు ట్వీట్ చేశాడు.

కానీ పోలీసులు మాత్రం నిందితుడు దొరకలేదని పది లక్షల రివార్డును ప్రకటిస్తూ ప్రకటన జారీ చేయడంతో గందరగోళం ఏర్పడింది. అయినా చాలా మందికి క్లారిటీ వచ్చింది ఏందంటే… నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని ఎన్‌కౌంటర్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందని. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించలేదు.

గతంలో దిశ కేసులో నలుగురిని ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యం ప్రజలను సంతోష పెట్టింది. కానీ ప్రభుత్వానికి ఓ మచ్చను మిగిల్చినట్లైంది. దీంతో ఈ సారి కొంత ఆలోచించి మొత్తానికి నిందితుడికి స్పాట్ పెట్టారు. ‘వాడి’ జీవితం విషాదాంతం అయ్యింది. కథ సుఖాంతమైంది. ప్రభుత్వ ప్లానింగ్ ఫలప్రదమైంది. పోలీస్ టెకింగ్ బంపర్ హిట్టయింది.

 

ఆ ప‌దిల‌క్షల రివార్డు ఎవ‌రికీ ద‌క్క‌దు.. ఎందుకంటే వాడు శ‌వ‌మై తేలుతాడు కాబ‌ట్టి… https://vastavam.in/2021/09/14/crime/p=2050/

You missed