ఆరేళ్ళ ముక్కుపచ్చలారని అమ్మాయి ( లేదా అబ్బాయి ) ని చూస్తే ముచ్చటేస్తుంది ! కానీ అత్యాచారం చేసి చంపేయాలని ఆలోచన ఎలా వస్తుంది ?

సైకాలాజికల్ పేర్వేర్షన్ ! మానసిక వికృతం ! ఇలాంటివారు చూడడానికి పైకి మామూలుగా వుంటారు . వీరిలో పైశాచిక కోణం ఉంటుందని గుర్తించడం చాలా కష్టం !

ఇది కరోనా పూర్వయుగం నాటి ఘటన ! అదొక సెంట్రల్ జైలు . అందులో high సెక్యూరిటీ బర్రాక్ ! కరుడుగట్టిన నేరస్తుల్ని అక్కడ సింగల్ సెల్ లో ఉంచుతారు . భయటవారెవరికీ అక్కడికి వెళ్లే అవకాశమే లేదు .

జైలు సందర్శన కోసం వెళ్లినవాడు ఒక గురువు . జైలు అత్యున్నత అధికారి అతని శిష్యుడు . ఒక సారి హై security బర్రాక్ అక్కడి ఖైదీల మనస్తత్వం చూడాలి అనుకొన్నాడు గురువు . గురువు మాట కాదనలేక స్వయంగా వెంట వెట్టుకొని వెళ్ళాడు శిష్యుడు .

అక్కడ భయానక నిశబ్దం . ఒక్కో సెల్ లో ఒక్కో ఖైదీ . ఒక సెల్ లో అమాయకంగా , చూడడం తోటే జాలిగొలిపే ఒక యువకుడు . సెల్ ఐరన్ గేట్ పై నుంచి నాలుగు చిన్న రాళ్లు తీసాడు . జైలు అధికారితో “ సర్ మీ కోసమే చూస్తున్నా! నిన్న నాకు ఫుడ్ లో ఈ రాళ్లు వచ్చాయి “ అన్నాడు . జైలు అధికారి ఆ ఖైదీ తో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడలేదు . సర్లే అంటూ ముందుకు సాగిపోయాడు . వెంట ఉన్న గురువుకు ఇది నచ్చలేదు .

వాడికి మాట్లాడడానికి రోజంతా ఎవరూ వుండరు . పాపం అమాయకుడిలా వున్నాడు . అన్నం లో రాళ్లు వచ్చాయని జైలు అధికారికి బిన్నవించుకొంటే ఇతనేంటి అసలు పట్టించుకోడు అని కోపం వచ్చింది . ఇదే విషయాన్ని శిష్యుడికి చెప్పాడు .

ఈ లోగా వారిద్దరూ హై సెక్యూరిటీ బర్రాక్ నుంచి బయటకు వచ్చారు . “ సర్ ! వాడెవడో మీకు తెలిసుంటే వాడిని అక్కడే చంపేయమని ఉండేవారు . అందుకే మీ ముందు వాడితో నేను మాట్లాడలేదు . నిద్రపోతున్న రెండేళ్ల పాపను తీసుకొని పోయి రేప్ చేసిన వాడు సర్ వాడు అన్నాడు .

వాడి అమాయకత్వం ఒక పక్క, వాడు చేసిన పని మరో పక్క – ఆ గురువుకు కు అరగంట షాక్ .

1 . పైశాచిక ప్రవృత్తి 2 . నీలి చిత్రాలు చూడడం 3 . విపరీతంగా మద్యం తీసుకోవడం .. ఈ మూడింటి కలయిక తో ఇలాంటి ఘోరాలు జరుగుతాయి . ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు . నీలి చిత్రాలు అలాంటి పేర్వేర్ట్స్ అగ్నికి ఆజ్యం పోస్తాయి . దానికి కూడా పరిష్కారం రావాలి .

Amarnath Vasireddy

You missed