సెవెన్ ఆర్ట్స్ ఫేమ్ స‌రయుపై బిగ్‌బాస్ భారీ అంచ‌నాలే పెట్టుకున్న‌ట్టున్నాడు. అస‌లు ఆమెకు అవ‌కాశం ఇచ్చిందే.. బూతుల‌తో ర‌చ్చ రంబోలా చేయ‌డానికి. అదే విష‌యం ఈ రోజు నాగార్జున ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఒప్పుకున్నాడు. ఒక్కొక్క‌రినీ లేపి వారి గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో ..

స‌ర‌యూ..! ఏంటీ నువ్వు బూతులు మాట్లాడ‌టం లేదు.. అన్నాడు నాగ్‌.

మీరేమంటారోన‌ని భ‌యంతో మాట్లాడ‌టం లేదు సార్‌.. అన్న‌ది స‌ర‌యు..

లేదు .. నువ్వెలా ఉన్నావో.. ఇక్క‌డా అలాగే ఉండాలి.. న‌చ్చింది మాట్లాడెసెయ్ అన్నాడు…

వంద‌రోజుల షో త‌ర్వాత మీతో డేట్ చేసేట‌ప్పుడు ఓపెన్‌గా ఉంటానంది.. పాపం ఓపెన్‌గానే చెప్పేసింది.

ఒకే త‌ర్వాత ఉందువు గానీ.. ముందు ఇక్కడైతే బూతులు మాట్లాడు అన్న‌ట్టుగా చెప్పాడు నాగ్‌.

ఉమాదేవీ మాట్లాడుతూ… చీటికి మాటికి లొల్లి పెట్టుకుంటేనే క‌దా.. ఇక్క‌డ గెలిచేది అన్న‌ది. ఆహా ఏమి మెచ్యూరిటీ లెవ‌ల్స్‌….

వారం రోజుల‌కే ఏడుపుల‌తో రక్తి క‌ట్టించేందుకు అప‌సోపాలు ప‌డుతున్న తీరు… పాపం నాగ్‌కే న‌చ్చ‌లేదు. అదే చెప్పాడీరోజు…

You missed