సోషల్ మీడియా ఎంత యాక్టివ్ అయ్యిందంటే.. ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా.. ముందు చదువు నేర్చుకోరా బై.. రాసుడు నేర్చుకోరా నాయనా..! తర్వాత మీకు సుద్దులు చెబుతువు కానీ.. అనేంత. అంత సూక్ష్మంగా పసిగట్టేస్తున్నారు. పనిగట్టుకుని, వెతికిమరీ లోపాలు గుర్తించి.. ఆడుకుంటున్నారు. వెక్కిరించి చంపేస్తున్నారు. వెటకారాలతో వేటాడేస్తున్నారు. నిన్న రుధిరం పేరుతో టీవీ9 యాంకర్ పలికిన పలుకుకు నెటిజన్లు మాములుగా ట్రోల్ చేయలేదు. ఇక జన్మలో ఆ టీవీ కఠిన తెలుగు పదాలను వాడేందుకు జంకుతుంది. వాడాలన్నా ఒకటికి పదిసార్లు అర్థాలను తరిచి చూసుకుంటుంది. తాజాగా ఓ టీవీ షో ఇంటర్య్వూలో ఓ మహిళ ఐదు ఇలాచీలు పర్సులో పెట్టుకుంటే చాలు పైసలొస్తాయని చెప్పుకొచ్చింది. ఇగ జూస్కో నా సామిరంగా.. ఒక్కొక్కరు నిన్నటి నుంచి ఆటాడేసుకుంటున్నారు. ఇలాచీల సువానలతో సోషల్ మీడియా గుమ్ముంటున్నది. ఆ ఘాటు ఆ టీవీ ఛానల్‌కు తాకినట్టుంది. మాకు సంబంధం లేదహో అని ఓ డిస్‌క్లయిమర్ కూడా వేసుసుకున్నది. సోషల్ మీడియాలో మాత్రం ఇంకా ఇలాచీల ట్రోల్ వేసేసుకుంటూనే ఉంటున్నారు. ఈ వీడియో ఒకసార చూసి.. మీరు కూడా ఓ ఐదు ఇలాచీలు వేసుకోండి.. డబ్బుల సంపాదన కోసం..