కరోనా పేరు చెప్పి ఎడాపెడా ఉద్యోగులను పీకిపారేసిన నమస్తే తెలంగాణ యాజమాన్యం.. కొన్ని విషయాల్లో పత్రిక పరువు బజారున పడుతున్నదని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. అధికార పార్టీ పత్రిక అయినప్పటికీ.. జీతాలు భారం మోయలేమని వందలాది మందిని ఈ విపత్కర, ఆపత్కాల పరిస్థితుల్లో ఉద్యోగులను రోడ్డుపాలు చేసింది. దీనిపై కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అజమాయిషీ లేకుండా పోయింది. ఎవరేమీ చేయలేరు. అంతా ఎడిటర్ చేతిలో ఉంది. ఆయన ఎలా చెబితే అలా. దీనికి తోడు ఇటు ఎస్జీవీ ఓవైపు… ఓరుగంటి మరోవైపు.. ఎవరికివారే తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే క్రమంలో ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ పత్రికలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇది చర్చకు దారి తీసింది. ఓ స్టాఫర్ .. ఆర్సీ ఇన్‌చార్జి భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అతని మాటలను సెల్ రికార్డుచేసి ఏకంగా ఎడిటర్‌కే పంపిందట ఆర్సీ ఇన్‌చార్జి భార్య. దీనిపై విచారణ చేపట్టాలని ఎస్జీవీని కోరినా.. ఇంత వరకు అతీగతీ లేదట. అతన్ని కాపాడే ప్రయత్నమూ జరుగుతున్నదట. దీని వెనుక మతలబేమిటో మన సవాల్ రెడ్డికే తెలవాలె.
మరో కేసు కూడా ఇలాంటిదే.స్టేట్ బ్యూరో, సిటీ బ్యూరో లోపనిచేసిన ఓ రిపోర్టర్ కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని హెడ్ ఆఫీసుకు ఫిర్యాదులొచ్చాయి. దీనిపైనా ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇది కూడా ఇప్పుడు మీడియా సర్కిళ్లలో చర్చకు తెరతీసింది. పాతవాళ్లందరిపై దొంగలు, లంగలు, లఫంగలు అని ముద్రవేసి బయటకు పంపి.. ఎవరి అనుచురులను వారు కాపాడుకునే క్రమంలో పత్రిక పరువును బజారుకీడుస్తున్నారు.