తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరేండ్ల కిందటే మన భీమ్లానాయక్ డాక్యూమెంటరీ విడుదలయ్యింది. చాలా అద్భుతంగా తీశాడు దర్శకుడు బాలాజీ దూసరి. దీనికి మాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. మంచి ఆదరణ లభించింది. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్లో మియాసాబ్ పాటను ఎంచుకోవడంతో కొమురయ్య ప్రపంచానికే పరిచయమయ్యాడు. భీమ్లా నాయక్ సినిమా పోస్టర్ కన్నా ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో 12 మెట్ల కిన్నెర .. దర్శనం మొగులయ్య పోస్టర్ చక్కర్లు కొడుతున్నది.
………………………………………………………..
జానపద కళాకారుడు మెగులయ్య పై
మొట్ట మొదటి డాక్యుమెంటరీ..
ఆరేండ్ల క్రితమే 12మెట్ల కిన్నెరతో ఆవిష్కృతం..
దర్శకుడిగా నేను గర్వపడుతున్నాను..
వందలేండ్ల వారసత్వ సంపదను కాపాడుతూ
అరుదైన కళని తన ఆస్థిగా నమ్ముకొని.. బతుకు పోరాటం చేస్తున్న మెగులయ్య పై
10 రోజులు షూటింగ్ చేసి ఆ కళ గొప్పతనాన్ని వెలికితీసినందుకు దర్శకుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆ రోజుల్లోనే ఈ డాక్యుమెంటరీ అందరి మన్ననలు పొందింది.
అంతేకాదు ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందుకుంది..
మీరు తప్పకుండా ఈ డాక్యుమెంటరీ చూడండి.