పాలమూరు జిల్లా మట్టిలో మాణిక్యం, పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్మనం మొగులయ్య. ప్రతిభ పవర్‌స్టార్ సినిమాకు కొత్త ట్రెండును తెచ్చింది. నేను ట్రెండును ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్‌చేస్తాను ఇది పవన్ కల్యాణ్ డైలాగ్. కానీ ఆ పవన్ సినిమాకే దర్శనం మొగులయ్య కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు. తన జానపద వీరగాధల పాటను భీమ్లానాయక్‌లో ఇంట్రడక్షన్ సాంగ్‌కు తన కళను అందజేశాడు. కిన్నెర వాయిద్య సంగీతాన్ని అందించాడు. తన మట్టి పాటల మధురమైన గొంతును అందించాడు.
పాలమూరు జిల్లా ఔసలకుంట గ్రామానికి చెందిన దర్శనం మొగులయ్య పాలమూరు చారిత్రక వీరగాధలను కంఠస్తం చేసి తన పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యంతో తెలంగాణ సంస్కృతిని మేళావించి, ప్రకృతితో మమేకమవుతూ తన గానంతో మంత్రముగ్ధులను చేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుత కళను గుర్తించింది. సంచారభిక్షువుగా ఉగాదిని పురస్కారాన్ని అందించి గౌరవించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక సమాఖ్య ఇతని పై డాక్యుమెంటరీని నిర్మించింది.
మియాసాబ్ అనే వీరుడి గాధ ఆధారంగా పాడిన పాటను స్పూర్తిగా తీసుకుని భీమ్లానాయక్ పాటను రాశారు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌కు మొగులయ్య పాటనే హైలెట్. ఆ తర్వాత వచ్చే పవర్ స్టార్‌ను కీర్తిస్తూ రాసిన రొడ్డకొట్టుడు సాహిత్యం అంతా బోరింగ్. తమన్ సంగీతం మొగులయ్య కిన్నెర వాయిద్యం ముందు బిక్కచచ్చిపోయింది. మాలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు ఇది తెలుగు రీమేక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రిన్‌ప్లే, రైటర్.