కరీంనగర్ లో హెల్మెట్ చట్టం అమలు చేసిన కొత్తలో వీళ్లకు ఎక్కడ పని లేదు గి సిటీలో ఏమన్నా 100 స్పీడ్ లో పోతామా హెల్మెట్ లేకుంటే ఏమైతది అనుకునేవాడిని..

హెల్మెట్ లేకుండా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ మాటు వేసి ఫోటో తీసి చలానా ఫోన్ కి పంపిస్తే తిక్క కోపం వచ్చేది సామాన్యుల మీద ఈ ఫైన్ లు అవసరమా అని..

కొన్నాళ్ళకు హెల్మెట్ అలవాటు అయింది ఎంతలా అని మాత్రం అడగద్దు రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా తల మీద ఏదో మిస్సింగ్ అని ఫీల్ అయ్యేంతల ఒక్కోసారి దుఖాన్లకు నడుచుకుంటూ పోదాం అనుకున్నప్పుడు కూడా మర్చిపోయి తలకు హెల్మెట్ పెట్టుకుని కొంత దూరం పోయిన రోజులున్నాయ్ అంతలా అలవాటు చేశారు మా మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమలాసన్ రెడ్డి సార్

ఇవాళ పొద్దున డ్యూటికి లేట్ అవుతుంది అని ఫాస్ట్ గా రెడీ అయి బండి తీసి రోడ్డు రోడ్డెక్కాను కలెక్టర్ నా విలేజ్ కి వచ్చి వెయిట్ చేస్తున్నాడు అన్నా కూడా నా బండి 40 స్పీడ్ దాటి పోదు అది ఎంత ఎమర్జెన్సీ అయినా సరే అదే 40 స్పీడ్ మెయింటెన్ చేస్తుంటా..

ఇవాళ అదృష్టమో దురదృష్టమో కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక కుక్క ఫోర్స్ గా నా బండి ని ఎదురొచ్చి గుద్ధింది ఏం జరిగిందో తెలీదు ఎగిరి పడి నా తల ముందు భాగం రోడ్డుకు గుద్దుకుంది హెల్మెట్ ఉండడం వల్ల తలకు చిన్న గాయం కూడా కాలేదు బట్ లెగ్ మాత్రం కొంచం ఇంజుర్ అయింది ఒకవేళ ఆ హెల్మెట్ లేకుంటే తల బలంగా రోడ్డుకు గుద్దుకోవడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ కాట్ అయ్యేది లేదా అక్కడిక్కడే RIP అయ్యేది ఇదైతే పక్కా..

ఆ టైం లో నాకు ఎవరు గుర్తు రాలేదు ఒక్క CP కమలాసన్ రెడ్డి సార్ తప్ప..

దయచేసి హెల్మెట్ ధరించండి అది ఖచ్చితంగ మీ ప్రాణాలు కాపాడుతుంది..🙏🙏🙏

Srinivas Sarla

You missed