రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డంలో ఇందూరు పాత్ర కీల‌కం. ఇక్క‌డి నాయ‌కులే ప్ర‌ధాన కార‌ణం. ఇక్క‌డి దీక్షే అందుకు మార్గం సుగ‌మం చేసింది. ఇదేంటీ..? రేవంత్ పీపీసీ చీఫ్ అవ్వ‌డానికి.. నిజామాబాద్‌కు అస‌లు సంబంధం ఉందా? మ‌రీ టూమ‌చ్ కాక‌పోతే. అని అనుకుంటున్నారా? ఈ విషయాన్ని స్వ‌యంగా ఆయ‌నే చెప్పాడు ఇటీవ‌ల జ‌రిగిన ఓ మీటింగులో. ఈ ఏడాది జ‌న‌వ‌రి 21న ఆర్మూర్‌లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మానాల మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రాజీవ్ రైతు భ‌రోసా దీక్ష‌ను చేప‌ట్టారు. ప‌సుపు బోర్డు సాధ‌న‌, ప‌సుపుకు మ‌ద్ధ‌తు ధ‌ర విష‌యంలో ఈ దీక్ష‌ను చేప‌ట్టి అర్వింద్‌ను కేంద్రాన్ని టార్గెట్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్‌రెడ్డి హాజ‌ర‌య్యాడు. మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి త‌దిత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. ఈ దీక్ష‌కు క‌నివినీ ఎరుగ‌నిరీతిలో రైతులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. దాదాపు 15వేల మంది రైతులు హాజ‌ర‌య్యారు. బాల్కొండ‌, ఆర్మూర్, నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి రైతులు వ‌చ్చి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు దీక్ష‌లో కూర్చుని ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేశారు. ఇది చూసి ఢిల్లీలో రేవంత్‌రెడ్డికి మంచి మైలేజీ వ‌చ్చింద‌ట‌. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టిలో ప‌డ్డాడ‌ట‌. త‌న‌ను పీసీసీ చీఫ్‌గా చేసే విష‌యంలో ఈ దీక్ష కూడా ఎంతో తోడ్ప‌డింద‌ని రేవంత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూడండి.

You missed