కన్నతల్లి ప్రేమను మించింది మరేది లేదంటారు. కన్నపేగు బంధం, అనుబంధానికి మించింది మరేదీ లేదు. అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ ఓ సైకో తల్లి .. మొగుడి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకునే బలిపశువును చేసింది. ఇసుమంత కూడా మనసు ద్రవించలేదు. చిత్రహింసల పాలు చేసింది. వాడు గిలగిలా కొట్టుకుంటుంటే .. ఆ ముఖంలో భర్త పడే వేదనను చూసింది. పైశాచికానందం పొందింది. చూశావా.. నాతో గొడవ పడి పోయావు కదా.. నీ కొడుకుపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నాననో అని రాక్షసానందం పొందింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ సైకో తల్లి.. తమిళనాడులోని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గొద్ది రోజులుగా భర్తతో గొడవ పడి దూరంగా ఉంటుంది. దాదాపు 250 వీడియోలు తీసి భర్తకు ఇలాగే రోజు పంపి నరకం చూపించింది. బాబు పరిస్థితి ఇప్పుడు సీరియస్‌గా ఉంది. స్టాలిన్ రంగంలోకి దిగాడు. ఈ సైకో తల్లిని పట్టి.. కటకటాలకు పంపించేందుకు.