నిన్న మంత్రి మ‌ల్లారెడ్డి రేవంత్ పై రెచ్చిపోయి తిట్ల దండ‌కం అందుకున్నాడు. ప‌నిలో ప‌ని పిచ్చ‌కుంట్లోడా అంటూ ఓ కులం పేరు తీసుకుని సంబోధిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఆ కులం మంత్రి మ‌ల్లారెడ్డి పై విరుచుకు ప‌డుతున్న‌ది. మీరూ మీరూ తిట్టుకోండి.. త‌న్నుకోండి.. మ‌ధ్య‌లో మా కులం ప్ర‌స్తావ‌న ఎందుకు మ‌ల్లారెడ్డి అని నిల‌దీత‌ల ప‌ర్వం మొద‌లుపెట్టారు. నాలుక క‌రుచుకున్న మ‌ల్లారెడ్డి రెండు చేతులెత్తి దండం పెట్టాడు. క్ష‌మించండ‌య్యా అని బ‌తిలాడాడు.

You missed