రియ‌ల్ ఎస్టేట్ ప‌రిస్థితి ఒక‌డుగు ముందుకు ఆరుడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా మారింది. మొద‌టి వేవ్ నుంచి దీనిపై ప‌డ్డ ప్ర‌భావం ఇంకా వీడ‌లేదు. రెండో వేవ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక దీంతో భూముల క్ర‌య‌విక్ర‌యాలు ఆగిపోయాయి. రిజిష్ట్రేష‌న్లు మంద‌గించాయి. స‌ర్కారుకు ఆదాయం భారీగా ప‌డిపోయింది. ఈ రంగంపై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది మందికి దిక్కుతోచ‌ని స్థితికి దిగ‌జార్చిన‌యి ప‌రిస్థితులు. ఇప్ప‌ట్లో ఇది కోలుకుంటుందా? అంటే ఆ వాతావ‌ర‌ణం కూడా క‌నిపించ‌డం లేదు. థ‌ర్డ్ వేవ్ బూజీ ఇప్పుడు రియ‌ల్ రంగాన్ని తీవ్రంగా భ‌య‌పెట్టిస్తున్న‌ది. ఎప్పుడు వ‌స్తుందో.. రాదో తెలియ‌దు. కానీ అది మాత్రం రియ‌ల్ రంగంపై ప్ర‌భావాన్ని చూపుతున్న‌ది. లిక్విడ్ క్యాష్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పెట్టుబ‌డులు దివాళా తీశాయి. మ‌రో రెండు నెల‌లూ ఇదే ప‌రిస్థితి క‌నిపించేలా ఉంది. మూడో వేవ్ ఉత్కంఠ ఇంకా వీడ‌టం లేదు. అది ఎప్పుడు వ‌స్తుంది? వ‌స్తే దాని తీవ్ర‌త ఎలా ఉటుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రూ ఇత‌మిత్థంగా స‌మాధానాలివ్వ‌డం లేదు. దీంతో ఎవ‌రికి వారే అంచాలు వేసుకుంటున్నారు. ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ రియ‌ల్ రంగం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌టం లేదు.

స‌ర్కార్ మ‌ధ్య‌లో రియ‌ల్ రంగాన్ని లేపాల‌ని చూసింది. భూముల రేట్లు ఆమాంతం పెరిగాయ‌నే ప్ర‌చార‌మూ చేసింది. కోకాపేట్ భూముల వేలాన్ని ఈ ప్ర‌చారానికి వాడుకున్న‌ది. కానీ దాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌లేదు. పెట్టుబ‌డులు బ‌య‌ట‌కు తీయ‌లేదు. రియ‌ల్ వ్యాపార‌మేమీ పుంజుకోలేదు. మ‌రో రెండు నెల‌ల పాటు ఈ అప్పుల తిప్ప‌లు.. క‌ష్టాల క‌న్నీళ్లు త‌ప్ప‌వేమో…

You missed